Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాలి కిరిటీ రెడ్డి సినిమాకు జూనియర్ పేరు ఖ‌రారు

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (18:04 IST)
Gali Kiriti Reddy'
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ప్రస్తుతం కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తోంది. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ సౌత్‌లో తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషలలో విడుదల కానుంది.
 
చిత్ర నిర్మాతలు ఇదివరకే కిరీటి రెడ్డిని పరిచయం చేస్తూ  ఒక గ్లింప్స్ ని విడుదల చేసారు. ఈ వీడియోలో కిరిటీ తన నైపుణ్యం అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో ఎక్స్ ట్రార్డినరీ గా కనిపించారు కిరిటీ. స్టైలిష్‌గా కనిపించి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ అందరినీ మెప్పించారు.
 
ఈ రోజు కిరిటీ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటిస్తూ మరో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రానికి 'జూనియర్'  అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వీడియోలో ఈ తరం యువత గురించి,  భవిష్యత్తు లక్ష్యాల గురించి ప్రతి జూనియర్‌కు ఉండే విశ్వాసం గురించి కిరిటీ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.
 
కిరిటీ రెడ్డి డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్‌తో తనదైన ముద్ర వేశారు. కాలేజీలో గోడకు ఆనుకుని ఫిడ్జెట్ స్పిన్నర్‌ను తిప్పుతూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ గ్లింప్స్ కోసం ప్లజంట్ బీజీఎం స్కోర్‌ చేశారు.
 
టైటిల్ గ్లింప్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. విడుదల చేసిన కొద్దిసేపటికే 5 మిలియన్ వ్యూస్ ని క్రాస్ అందరినీ ఆకర్శిస్తోంది.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వారాహి చలనచిత్రం ప్రొడక్షన్ నంబర్ 15 గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ఉన్నారు. టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్స్ లో ఒకరైన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, జెనీలియా ఒక ముఖ్యమైన పాత్రతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ లెజెండ్ క్రేజీ స్టార్ డాక్టర్ రవిచంద్ర  కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణుల ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.
 
సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాహుబలి లెన్స్‌మెన్ కెకె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ గా,  భారతదేశపు అగ్రశ్రేణి స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

Navratri Viral Videos: గర్బా ఉత్సవంలో ఆ దుస్తులేంటి? వీడియో వైరల్

Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments