Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్టీఆర్ ఫ్యాన్సుకు శుభవార్త.. జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల వద్ద నారా కుక్కలు

Advertiesment
Aadi
, సోమవారం, 26 సెప్టెంబరు 2022 (15:23 IST)
Aadi
ఎన్టీఆర్ ఫ్యాన్సుకు శుభవార్త. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి నవంబర్ నెలకు 22 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నవంబర్ నెలలో ఆది సినిమాని రీ-రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
ఆది సినిమాలో ఆ జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్‌గా నటించగా అలీ, ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు వీవీ వీనాయక్ డైరెక్షన్ చేశారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడమే కాక జూనియర్ ఎన్టీఆర్‌కి సూపర్ క్రేజ్ తీసుకొచ్చింది.
 
అయితే నవంబర్ నెలలో విడుదలవుతున్న ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక పరీక్ష అనే చెప్పాలి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీకి ఈ మధ్య కాస్త దూరం పెరిగింది. 
 
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో ఆయన చేసిన ట్వీట్ అర్థవంతంగా లేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తున్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా దారుణమైన విధంగా జూనియర్ ఎన్టీఆర్ కాళ్ల వద్ద నారా కుక్కలు అనే విధంగా ట్రోల్ చేశారు. 
 
ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేస్తే టీడీపీ అభిమానులు మునుపటిలా జూనియర్ ఎన్టీఆర్‌ని సపోర్ట్ చేస్తూ థియేటర్లకు వెళ్లడం కాస్త కష్టమైన విషయమే. ఇప్పుడు రీ-రిలీజ్ విషయంలో ఒక్కో సినిమాతో ఒక్కో రికార్డులు బద్దలవుతున్నాయి.

ఒక్కడు సినిమా రికార్డులను జల్సా సినిమా బద్దలు కొడితే జల్సా సినిమా రికార్డులను కొన్ని చోట్ల చెన్నకేశవరెడ్డి సినిమా బద్దలు కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎలా అయినా ఆది రీ-రిలీజ్ విషయంలో మిగతా సినిమాల రికార్డులు బద్దలు కొట్టాలని భావిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరలక్ష్మీ శరత్ కుమార్ శబరి కొడైకెనాల్ షెడ్యూల్ పూర్తి