Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊసరవెల్లిలా మారవయ్యా తారక్.. త్రివిక్రమ్ సలహా

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ... యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రి

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (19:22 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో అజ్ఞాతవాసి సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతున్న వేళ... యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ బిజీగా వున్నారని తెలిసింది. ఎన్టీఆర్‌తో సినిమా ఇటీవల పవన్ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ స్క్రిప్ట్‌కు తారక్ ఒళ్లు తగ్గిస్తే బాగుంటుందని తెలిసింది. చాలామంది త్రివిక్రమ్‌కు కూడా ఇదే చెప్పారట. అంతే త్రివిక్రమ్ వెంటనే ఎన్టీఆర్‌తో కాస్త స్లిమ్ అవ్వాలని సూచించారట. అంతేకాకుండా.. పది కిలోల బరువు తగ్గితే బాగుంటుందని చెప్పారట. త్రివిక్రమ్ చెప్పడమే ఆలస్యం తారక్ కసరత్తులు మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది. 
 
''ఊసరవెల్లి" సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సన్నగా మారిపోతే బెస్టని త్రివిక్రమ్ చెప్పడంతో జిమ్‌ కెళ్తూ తారక్ బిజీగా వున్నాడని సమాచారం. ఇక ఈ చిత్రంలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్‌ను తీసుకుంటారని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments