Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్ మూవీ హిట్ కాకూడదు : జూనియర్ ఎన్టీఆర్

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (14:17 IST)
నందమూరి బాలకృష్ణ - దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". 'కథానాయకుడు', 'మహానాయకుడు' అనే పేర్లతో రెండు భాగాలుగా రానుంది. ఈ చిత్రం ట్రైలర్, ఆడియో రిలీజ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ వేదికగా జరిగింది.
 
ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ విజయం సాధించకూడదని సభాముఖంగా ప్రకటించారు. ఎందుకంటే ఎన్టీఆర్ విజయం సాధించడం వల్లే ఈ బయోపిక్ మొదలైంది. చరిత్రకు విజయాలు, అపజయాలు ఉండవు. కేవలం చరిత్ర సృష్టించడమే ఉంటుందని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా, ''ఆ మహామనిషి కుటుంబంలోని ఒక కుటుంబ సభ్యుడిగా నేను మాట్లాడటం లేదు. ఒక మహానుభావుడు చేసిన త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా నేను మాట్లాడుతున్నాను. తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికీ చెందిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ మహానుభావుడి చరిత్రను మా తరానికి.. ముందుతరాలకు తీసుకెళ్తున్న బాబాయ్ బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా సరిపోదు. మా పిల్లలు తాతయ్య ఎన్టీఆర్ గురించి అడిగితే.. మా తాత గురుంచి మీ తాతయ్య తీసిన చిత్రం ఉందని చూపిస్తా' అంటూ భావోద్వేగంతో అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments