Webdunia - Bharat's app for daily news and videos

Install App

తారక్ అన్నా.. నీ అంకితభావం చూస్తుంటే ముచ్చటేస్తోంది.. ఎస్ఎస్ థమన్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న చిత్రం అరవింద సమేత వీరరాఘవ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్. థమన్ సంగీత దర్శకుడు. ఫ్యాక్షనిజం బ్యాక్

Webdunia
మంగళవారం, 4 సెప్టెంబరు 2018 (08:58 IST)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ - పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న చిత్రం అరవింద సమేత వీరరాఘవ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్. థమన్ సంగీత దర్శకుడు. ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
 
అయితే, ఈ చిత్ర హీరో ఎన్టీఆర్ తండ్రి, సినీ హీరో నందమూరి హరికృష్ణ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తండ్రి మృతిని ఎన్టీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారు. అదేసమయంలో తన వృత్తిపట్ల ఎంతో అంకితభావం కలిగివుండే జూనియర్ ఎన్టీఆర్.. ఆ అంకింత భావాన్ని మరోమారు చూపారు. 
 
తండ్రిలేడన్న నిజాన్ని గుండెల్లోనే దాచుకుని తన బాధలన్నింటినీ పక్కనబెట్టి... ప్రస్తుతం హీరోగా నటిస్తున్న 'అరవిందసమేత వీరరాఘవ' సెట్స్‌లో దర్శనమిచ్చారు. దీంతో అతని డెడికేషన్ చూసి సినీ ప్రేమికులు మురిసిపోతున్నారు.
 
ముఖ్యంగా ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అయితే తారక్ అంకితభావాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ వేదికగా తారక్ చేసిన ఈ పని తనను ఎంతో ఉత్తేజపరిచిందని వ్యాఖ్యానించారు. 'తారక్ అన్నా.. నువ్వంటే ఎంతో గౌరవం పెరిగిపోయింది. మేం అంతా నీతో ఉన్నాం. నీ అంకితభావం చూస్తుంటే ముచ్చటేస్తోంది. #అరవిందసమేతవీరరాఘవ సెట్స్‌లో అన్నా(ఎన్టీఆర్)' అని థమన్ ట్వీట్ చేశారు. 
 
హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 11న విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments