Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్.. ఎస్వీ రంగారావు పాత్రలో నాగబాబు.. మరి మోహన్‌బాబు?

తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని కీలక ఘట్టాలన్నీ చూపించబోతున్నారు. స్వయంగా బాలయ్య తన త

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (18:31 IST)
తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్‌లో ఎన్టీఆర్ జీవిత చరిత్రలోని కీలక ఘట్టాలన్నీ చూపించబోతున్నారు. స్వయంగా బాలయ్య తన తండ్రి పాత్రలో నటిస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య ఒదిగిపోయాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అబిడ్స్‌లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో జరుగుతోంది. 
 
కొన్ని రోజులపాటు ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను, హైదరాబాద్ - అబిడ్స్‌లోని ఎన్టీఆర్ పాత ఇంట్లో చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్లో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఎస్వీ రంగారావు పాత్రలో 'నాగబాబు'ను తీసుకోనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
 
'మహానటి' సినిమాలో ఎస్వీరంగారావు పాత్రను మోహన్ బాబు అద్భుతంగా పోషించారు. ఎన్టీఆర్‌తో మోహన్ బాబుకి గల ప్రత్యేకమైన అనుబంధం కారణంగా, ఎన్టీఆర్ బయోపిక్‌లోను ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించే అవకాశం ఉందని అనుకున్నారు. 
 
కానీ 'మహానటి'లో చేసినవాళ్లనే తీసుకుంటే కొత్తదనాన్ని ఆడియన్స్ మిస్ అవుతారనే ఉద్దేశంతో నాగబాబును సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పాత్రకి నాగబాబు సరిగ్గా సరిపోతారని అందరూ భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాలో శ్రీదేవి పాత్రలో రకుల్ కనిపించనుండగా, జయప్రద పాత్రలో రాశిఖన్నా నటించనుందనే టాక్ వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments