Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ నరేష్... నన్ను చెడుగా ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నారు.. జీవిత రాజశేఖర్

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:43 IST)
మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై సినీ నటి జీవిత రాజశేఖర్ మరోమారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై ఒక్క ఆరోపణ అయినా నిరూపించగలిగితే మీ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెపుతాననని జీవిత రాజశేఖర్ అన్నారు. 
 
మా అధ్యక్షుడుగా పనిచేసిన నరేష్ తననెందుకు చెడ్డదానిగా పనిచేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. నరేష్ నీకు ఎందుకింత కక్ష మా మీద అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఇదే అంశంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, మా ఎన్నికల్లోకి నేను రాను అన్న నరేష్ ఇపుడు అర్జునుడు కృష్ణుడు అని ఎందుకు చెప్పుకుంటున్నారని ఆమె నిలదీశారు. వీళ్లు కొందరు ఫాన్స్‌తో ఏవేవో చేయిస్తున్నారని.. సభ్యులు బెదిరి పోవాల్సిన అవసరం లేదన్నారు. 
 
నరేష్‌తో నేను ట్రావెల్ అయ్యాను కాబట్టి నరేష్ ఎలాంటి వాడో నాకు తెలుసునని జీవిత రాజశేఖర్ తెలిపారు. సభ్యులకు ఏమి కావాలో అది చేద్దాము.. అవే చెబుతామని ఆమె సూచించారు. మీరు సభ్యులను భయ పెడుతున్నారా? ప్రకాష్ రాజ్ ఇక్కడ ఉండడు అంటున్నారు.. అయన లేకపోతే మేము వున్నాము కదా..? నరేష్ ఎప్పుడైనా వున్నాడా..? మేము కదా చేసింది.. నా వరకు నేను ఎంత సిన్సియర్‌గా పనిచేశానో చెపుతానన్నారు. నరేష్ అవకాశం ఇవ్వలేదు అందుకనే చాలా పనులు ఆగిపోయాయన్నారు. 
 
నరేష్, మీరు మాట్లాడేదానికి అర్థం ఉండాలి.. మోహన్ బాబు,  విష్ణు మీరటే నాకు రెస్పెక్ట్ వుంది.. ఎందుకు నరేష్ సపోర్ట్ తీసుకుంటున్నారని జీవిత ప్రశ్నించారు. ఎన్నికల బరిలో రెండు ప్యానెల్స్‌గా వున్నాము..  హెల్తీగా కాంటెస్ట్ చేద్దాము...  ప్రకాష్ రాజ్‌ను లోకల్..  నాన్ లోకల్ అంటున్నారు. 
 
మరి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఎవరు? అయన ఇక్కడ వారు కాదే అని జీవిత ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్‌ని కలిశాను.. అయన కూడా మా లో జరుగుతున్న పరిణామాలను చూసి బాధపడ్డారు.. నేను ఓటు వెయ్యడానికి రాను అని చెప్పారని జీవిత వివరించారు. 
 
మీరు ఏమి చెప్పాలని అనుకుంటున్నారు..? 900 మందిని మీరు బ్రెయిన్ వాష్ చేస్తున్నారా మాకే ఓటు వేయాలని? ఎలక్షన్స్ ముందు ఎందుకిన్ని డ్రామాలు..? ప్రకాష్ రాజ్ షూటింగులో ఎవరినో బూతులు తిట్టారు అని అన్నారు.. మీరు కొట్టలేదా..? తిట్ట లేదా..? అని జీవిత నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

బీజేపీ జాతీయ అధ్యక్షురాలి రేసులో తెలుగు మహిళ!

తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించిన రష్యా.. మాస్కోలో కొత్త ఆఫ్ఘన్ రాయబారి...

లండన్‌లో జల్సాలు - పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా - లలిత్ మోడీ!

కోల్‌కతా న్యాయ విద్యార్థిని అత్యాచార కేసులో విస్తుపోయే నిజాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments