Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ‌లో కొత్త కోణంతో నేను లేని నా ప్రేమ కథ

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (18:35 IST)
Nenu leni na prema katha team
నవీన్ చంద్ర, క్రిష్ సిద్ది పల్లి, గాయత్రి ఆర్ సురేష్, అదితి మ్యాకల్, రాజా రవీంద్ర న‌టించిన సినిమా `నేను లేని నా ప్రేమ కథ`. సురేష్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, డాక్టర్ భాస్కర్ రావ్ అన్నదాత నిర్మించిన చిత్రమిది. అక్టోబర్ 8న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా  హైదరాబాద్ లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ఈ చిత్రం ట్రైలర్, పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత వివేక్ కూచిభొట్ల, కొరియోగ్రాఫర్ స్వర్ణ బాబు. బి.యన్ ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంజనా షా, యు.ఎఫ్. ఓ మూవీస్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గుంటూరు లక్ష్మణ్ లు చిత్రం లోని పాటలను విడుదల చేయగా డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య  ట్రైలర్ ను విడుదల చేశారు.
 
అనంతరం వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ, ఒక చిన్న సినిమాను సపోర్ట్ చేస్తున్న వి యఫ్ ఓ లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. నేను సినిమా చూశాను  కొత్త కంటెంట్ తో తీసిన  సినిమా నాకు బాగా నచ్చింది.లక్ష్మణ్ ఇక ముందు ఇలాంటి మంచి సినిమాలను విడుదల చేయాలని మనవి చేసుకుంటున్నాను అన్నారు.
 
వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ, చాలా గొప్ప టైటిల్. ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి ఎప్పుడైనా సరే ప్రేమలో పడటం అంటే మనం మరణించి మనం ప్రేమించిన వ్యక్తి గా మళ్లీ పుట్టడం. మన ప్రేమ కథలో మనమెప్పుడూ ఉండం. మన ప్రేమ కథలో మనమెప్పుడూ ఎదుటి వ్యక్తి అయి పోతాము.అలా అయిపోతేనే మనం ప్రేమలో ఉన్నట్టు. అలాంటి అద్భుతమైన టైటిల్ పెట్టి నాకు జలసి ని సృష్టించారు . పాటలు విన్న తరువాత రాంబాబు గోశాల ఎక్సలెంట్ లిరిక్స్ ఇచ్చారు.ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు దర్శకుడు. క్రిష్ స్పీచ్ విన్న తరువాత అలాగే లక్ష్మణ్ గారి గురించి క్రిష్ చెప్పిన మాటలు విన్న తరువాత నావి  మంచి కథలున్న మూడు సినిమాలు విడుదల కు సిద్ధంగా ఉన్నాయి. నా మూడు సినిమాలకు క్రిష్ హీరో అయ్యుంటే ఎలాగైనా సరే క్రిష్ వెంటబడి లక్ష్మణ్ గారిద్వారా విడుదల చేయించేవాడు. తెలుగులో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రావడంలేదని సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తుంటారు.  ఇలాంటి మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తే మరిన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తాయి.ఇలాంటి మంచి చిత్రాలను విడుదల చేస్తామని లక్ష్మణ్ గారు ముందుకు వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు .ఈ నెల 8న వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి  గొప్ప విజయం చేకూర్చాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు
 
చిత్ర నిర్మాత  కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ సినిమా విడుదల కోసం మేము రెండు సంవత్సరాల నుండి  వెయిట్ చేస్తున్నాము  మేము థియేటర్లోనే విడుదల చేయాలని ఇంత వరకు ఆగాము .మాది చిన్న టీం అయినా కూడా చాలా కష్టపడి వర్క్ చేశాము. లిమిటెడ్ బడ్జెట్ లో  హై క్వాలిటీతో చేసిన ఈ సినిమా బాగా వచ్చింది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న సినిమా ఇది  ఫీల్ గుడ్ లాంటి మంచి సినిమాలను  ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు ఈ నెల 8న వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరించి మా టీం ను ఆశీర్వదించాలని మనవి చేసుకుంటున్నాను అన్నారు.
 
చిత్ర దర్శకుడు సురేష్ ఉత్తరాది మాట్లాడుతూ.. ఇది ప్రేమ వేదం, ఇది ప్రేమ నాదం ,ఇది ప్రేమ మంత్రం, నిత్యం ప్రేమను జపిస్తూనే ఉంటాం  ఏ తరాలు మారినా ప్రేమ అజరామరంగా ఉంటుంది . ప్రేమకథలు హ్యాండిల్ చేయడం చాలా కష్టం కానీ రెండక్షరాల ప్రేమను కోటాక్షరాలు కూడా తెలుపలేవు అంటారు. అటువంటి ప్రేమకథను మా టీం సపోర్టుతో కళ్యాణ్ గారికి  కథ చెప్పడం జరిగింది.చిత్ర నిర్మాతలకు మేము చెప్పిన కథ చెప్పడంతో మా డ్రీమ్ ను నిర్మాతలు ఫుల్ ఫిల్ చేశారు. ఇంత అందమైన ప్రేమకథను జనాల ముందుకు తీసుకెళ్లడం అనేది పెద్ద సముద్రం మీద బ్రిడ్జ్ కట్టడం లాంటిది. సముద్రం మీద బ్రిడ్జి  కట్టలేము అన్నది ఎంత వాస్తవమో  అటువంటి టఫ్ సిచువేషన్ లో  నిర్మాతలు, లక్ష్మణ్ గారు,  బి.యన్.ఐ టీం మా వెనక వెనక ఉండి చాలా సమయాల్లో  హెల్ప్ చేస్తూ మాకు సపోర్ట్ గా నిలిచారు.  హీరోయిన్ను చాలా చక్కగా నటించింది  నటీనటులందరూ చాలా డెడికేటెడ్ గా ఫర్ చేశారు . ఈ నెల 8న వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు
 
 బి.యన్.ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజన షా మాట్లాడుతూ .. ఈ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాము. రెగ్యులర్ గా వస్తున్న లవ్ స్టొరీ కాదు.డీఫ్రెంట్ గా వస్తున్న ఈ లవ్ స్టొరీ ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
 
 యు.ఎఫ్. ఓ మూవీస్  లక్ష్మణ్ మాట్లాడుతూ. సంవత్సరం క్రితం ఈ సినిమా పాటలు వీరితో కలసి క్యాజువల్ గా  విన్నాను. ఈ సాంగ్స్ ఇంట్రెస్ట్ గా అనిపించడంతో  సినిమా చూయించమని చెప్పి మూవీ చూడడం జరిగింది.సినిమా నచ్చడంతో ఎలాగైనా మాకున్న నెట్వర్క్ తో ఈ సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాను.పెద్ద సినిమాలకు ఎవరో ఒకరు తోడుగా ఉంటారు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు ఎవరూ సపోర్ట్ ఉండరని మేము ఈ సినిమాకు సపోర్ట్ ఉండాలని  ముందుకు వచ్చాము.మాలాంటి వాళ్ల సపోర్ట్ చేస్తే ఈ సినిమా థియేటర్స్ కెళ్లి జనాలకు రీచ్ అయ్యి అవుతుంది. ఇందులో హీరోయిన్ చేసిన రాధా క్యారెక్టర్ చూసినవాళ్ళు వన్ వీక్ వరకు క్యారీ చేస్తారు. అంత బాగా ఉంటుంది. ఈ సినిమా విడుదల చేయాలని నిర్ణయించుకొన్న తరువాత చిత్ర యూనిట్ చేసే ప్రతి అప్డేట్ తెలుసుకుంటూ వీరి కష్టాన్ని గమనించాము..మంచి కంటెంట్ తో అక్టోబర్ 8న వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
 
డైలాగ్ రైటర్ సబీర్ షా  మాట్లాడుతూ.. నాకు డైలాగ్ రైటర్ గా ఇది ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమా కు వర్క్ చేస్తానని  అనుకోలేదు.ఎలాంటి ఫిలిం అయితే సపోర్ట్ చేస్తారో ..దేంట్లో అయితే రాయడానికి స్కోప్ ఉంటుందో..దేంట్లో అయితే   మనసు పెట్టి మాట్లాడే అవకాశం ఉంటుందో..   ఏ పాత్రలైతే మన చుట్టూ జీవితంలో కనిపిస్తాయో అలాంటి సినిమానే నేను లేని నా ప్రేమ కథ" .ప్రతి  టెక్నీషియన్స్, నటీనటులు దర్శక, నిర్మాతలు ఇలా అందరూ ఈ  సినిమాకు ప్రాణం పెట్టి వర్క్ చేశారు.ఇలాంటి మంచి సినిమాకు  వర్క్ చేయడం  అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు.
 
గీత ర‌చ‌యిత రాంబాబు గోశాల  మాట్లాడుతూ,  అచ్చమైన తెలుగు పదాలతో సందర్భానుసారంగా సాగే పాటలను రాయించుకున్నాడు దర్శకుడు సురేష్ కి నా ధన్యవాదాలు. పాటలు చాలా వినసొంపుగా ఉన్నాయి ఈ పాటకు సంగీతం అందించిన  సంగీత దర్శకుడు చాలా మంచి మెలోడీస్ ఇచ్చాడు ఆయనకు ఇది ఫస్ట్ సినిమా అయినా తనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మా ప్రొడ్యూసర్లు సినిమాను కరోనా టైంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఓపికగా వుంటూ ఈ సినిమాను థియేటర్స్ లొనే రిలీజ్ చేయాలని ఇంతవరకు ఆగారు.ఈనెల 8 న వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ చూసి పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
 
నటుడు క్రిష్ మాట్లాడుతూ .. 2019లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. 2020 ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని చూశాము.  క‌రోనావ‌ల్ల గత సంవత్సరం నుంచి టీం తోడుగా ఉంటూ మాకు సపోర్ట్ గా నిలిచారు వీరందరూ దర్శకుడు సురేష్ గారికి బ్యాక్ బోన్ గా నిలిచారు మా సినిమాకు మంచి టెక్నీషియన్స్ ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము .ఈ సినిమాలో పాటలు అన్నీ చాలా బాగున్నాయి .జువీన్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చాడని తెలిపారు.
 
చిత్ర హీరోయిన్ మాట్లాడుతూ.. నవీన్ చంద్ర లాంటి సీనియర్ ఆర్టిస్ట్ తో వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.నా కెరీర్ లొనే గుర్తుండిపోయే రాధ పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసెంబ్లీకి రాను, మీడియా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తా: వైఎస్ జగన్

ఎవరైనా చెల్లి, తల్లి జోలికి వస్తే లాగి కొడ్తారు.. జగన్‌కి పౌరుషం రాలేదా? (video)

పసుపు చీరతో షర్మిల ఆకర్షించిందా.. విజయసాయికి బుద్ధుందా?: బుద్ధా వెంకన్న

ట్రోలింగ్‌తో నా కుమార్తెలు కన్నీళ్లు పెట్టుకున్నారు.. పవన్ కామెంట్స్ వైరల్

ప్రారంభమైన దుబాయ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

ఉసిరికాయలను ఎవరు తినకూడదు? ఎందుకు తినకూడదు?

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments