Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ ఆవిష్క‌ర‌ణ - ఎస్ పి బాలు కి అంకితం

Advertiesment
తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ ఆవిష్క‌ర‌ణ - ఎస్ పి బాలు కి అంకితం
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (16:24 IST)
Vishnu Boppana, VK Naresh, Shiva Balaji etc
వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులతో పాటు వెండితెర అవార్డులు అందిస్తోంది. వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీని రూపొందించారు. ఈ డైరీని గానగంధర్వ పద్మవిభూషణ్ ఎస్ పి బాలసుబ్రమణ్యం గారికి అంకితమిచ్చారు. 
 
ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రసాద్ ల్యాబ్ లో సినీప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. మా అధ్యక్షులు వి కె నరేష్ డైరీని లాంచ్ చేసి నటుడు శివ బాలాజికి విష్ణు బొప్పనకి అందజేశారు, త్వరలో జరగబోయే వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ బుల్లితెర అవార్డుల బిగ్ పోస్టర్ ను ఆవిష్కరించారు, ఎప్పటిలాగే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ పేద కళాకారులకు పదివెల రూపాయలు అందజేశారు.
 
అనంత‌రం వి కె నరేష్ మాట్లాడుతూ, గత కొంత‌కాలంగా వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు  బొప్పన డైరీ, బుల్లితెర అవార్డులు, వెండితేర అవార్డులు,పేద సినీ, టి వి కాకకారులని ఆదుకోవటంలోగాని  కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆపకుండా చేస్తున్నారు ఆయనకు  అదే విధంగా సహకరిస్తున్నదుకు వాళ్ళ స్పాన్సర్స్ కి  నా ధన్యవాదాలు అన్నారు.
 
నటుడు శివ బాలాజీ మాట్లాడుతూ, ఇన్నికార్యక్రమాలను నిర్వహిస్తూ ఇంకా ఏదో చేయాలాని తపన పడుతున్న విష్ణు  బొప్పన గారికి  ఆయనకు సహకరిస్తున ప్రతి ఒక్కరికి మంచి జరిగి ఇంకొంత మందికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకొంటున అని అన్నారు.                     వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన మాట్లాడుతూ,  ఇంకొన్ని సామజిక కార్యక్రమాలను ప్లాన్ చేశా నన్ను ఇలాగె ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్- 5.. నటరాజ్ మాస్టర్‌కి సర్పైజ్.. ఆ రెండు జంటల లవ్ ట్రాక్