Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 1 May 2025
webdunia

టాలీవుడ్‌లో టగ్ ఆఫ్ వార్ : నిర్మాతలు వర్సెస్ థియేటర్ ఓనర్స్

Advertiesment
Tug of war
, సోమవారం, 23 ఆగస్టు 2021 (19:59 IST)
కరోనా వైరస్ కారణంగా తెలుగు చిత్రపరిశ్రమ స్తంభించిపోయింది. దీంతో ఓటీటీ ఫ్లాట్‌ఫాం పుంజుకుంది. మున్ముందు ఇది మరింతగా వ్యాపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో సినిమా థియేటర్స్ మూతపడే అవకాశాలు ఉన్నాయంటూ తెలుగు రాష్ట్రాల థియేటర్స్ ఓనర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ఓటీటీలకు అడ్డుకట్ట వెయ్యకపోతే సినీపరిశ్రమకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని, థియేటర్స్‌ని నమ్ముకున్న జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలంగాణా థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తంచేస్తోంది. 
 
తెలంగాణ సినిమా థియేటర్స్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20న సమావేశమైంది. ఈ సమావేశంలో కొందరు చేసిన విమర్శలపై ప్రెస్‌నోట్‌ను ప్రొడ్యూసర్స్ గిల్డ్ విడుదల చేసింది. 
 
మరోవైపు, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానులు స్పందించిన తీరుతో తెలుగు సినిమా నిర్మాతలు తీవ్రంగా కలత చెందారు. ఆ తర్వాత థియేటర్ యజమానులకు కౌంటర్‌ ఇచ్చారు. ఫలితంగా తెలుగు సినిమా నిర్మాతలు, థియేటర్‌ యజమానుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
 
సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. అయితే సినిమా అనేది మొదలయ్యేది నిర్మాత వల్లనే, ఎక్కడ, ఎప్పుడు రిలీజ్ చేయాలో, ఎవరికి అమ్మాలో అది నిర్మాత ఇష్టం. బహిరంగంగా విమర్శలు చేయడం సరికాదు. నిర్మాతలకు సహాయపడేలా విధంగా ఎగ్జిబిటర్స్ ఉండాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశాము. కానీ వారు పెద్ద సినిమాలకు, డిమాండ్ వున్న సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 
 
చిన్న సినిమా లపై వారు ఎటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్‌లు అందరూ కలసి ఉంటేనే సిని పరిశ్రమ బాగుంటుంది. ప్రస్తుత సమస్యలపై అందరూ కలిసి చర్చించుకుని పరిష్కారాలు ఆలోచించుకోవాలి అని నిర్మాతల మండలి అభిప్రాయపడింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాలేజీ స్నేహితురాలినే వివాహం చేసుకుంటున్న కార్తికేయ‌