Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌క‌త్వంలో జే.డి చ‌క్ర‌వ‌ర్తి

JD chakravarti
Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (12:24 IST)
జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోతో తెలుగు ప్ర‌జ‌ల‌కి సుప‌రిచిత‌మైన క‌మెడియ‌న్, స్క్రిప్ట్ రైట‌ర్ కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌కునిగా మారారు. శ్రీ ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై కోవూరు అరుణాచ‌లం నిర్మాత‌గా కిరాక్ ఆర్.పి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ప్రొడ‌క్ష‌న్ నెం 1 సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ను జే.డి చ‌క్ర‌వ‌ర్తి పోషిస్తున్నారు. ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ మూవీ ఆఫీసులో జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మానికి వెండితెర‌, బుల్లితెర రంగాల‌కి చెందిన వివిధ ప్ర‌ముఖులు విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
ఈ ప్రారంభోత్స‌వానికి విచ్చేసిన వారిలో జే.డి.చ‌క్ర‌వ‌ర్తితో పాటు, మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోకి చెందిన ఆర్టిస్టులు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కిరాక్ ఆర్.పి మాట్లాడుతూ... గ‌త కొన్నేళ్లుగా జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షో ద్వారా న‌న్ను ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కి కృత‌జ్ఞ‌త‌లు. సస్పెన్స్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుద‌ర‌డంతో ద‌ర్శ‌కునిగా ఆడియెన్స్ ముందుకి రావ‌డానికి నిశ్చ‌యించుకున్నాను.
 
నా మీద న‌మ్మ‌కంతో నిర్మాత కోవూరు అరుణాచలం గారు సినిమాని నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ప‌ద్మ‌జ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1 గా, నా డైర‌క్ష‌న్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమాలో జేడీచ‌క్ర‌వ‌ర్తి కీల‌క పాత్ర పోషించ‌‌డానికి అంగీక‌రించ‌డం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో జే.డి. పాత్ర చాలా విల‌క్ష‌ణంగా ఉంటుంది. జే.డి.చ‌క్ర‌వ‌ర్తితో పాటు, ప్ర‌కాశ్ రాజ్, రావుర‌మేశ్, జ‌బ‌ర్ధ‌స్థ్ ఆదిత్య త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌లో హైద‌రాబాద్, నెల్లూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments