Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయమ్మ పంచాయతీ టైటిల్ సాంగ్ న‌చ్చిందన్న రాజ‌మౌళి

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (11:26 IST)
Suma
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజమౌళి ఆదివారంనాడు జయమ్మ పంచాయతీ` టైటిల్ సాంగ్‌ను ఆవిష్కరించారు. ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ నటించింద‌నేది ఈరోజు విడుద‌లైన టైటిల్ సాంగ్‌లో క‌నిపిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంద‌ర్భానుసారంగా బాణీలు స‌మ‌కూర్చారు. దీనికి శ్రీకృష్ణ గాత్రం అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం రాశారు.  ఈ పాట ఫన్నీ విజువల్స్‌తో ఆక‌ట్టుకునేలా వుంది. ఈ టైటిల్ సాంగ్ త‌న‌కు బాగా న‌చ్చింద‌ని రాజ‌మౌళి ట్వీట్ చేశాడు.
 
టైటిల్ రోల్‌ను సుమ కనకాల పోషించ‌గా వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మించారు. విజయ్ కుమార్ కలివరపు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
 
చిత్రం గురించి చెప్పాలంటే, పల్లెటూరి డ్రామా చిత్రమే `జయమ్మ పంచాయతీ`. ప్ర‌ధాన పాత్ర‌తో సుమ‌ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తోంది. షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్ర గురించి చిత్ర యూనిట్ ప్ర‌చారం మొద‌లు పెట్టింది. ఇటీవ‌లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టైటిల్,  ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ త‌ర్వాత‌ నేచురల్ స్టార్ నాని ఫస్ట్ సింగిల్, హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈరోజు ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు.
 
దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు సినిమా కోసం వర్కబుల్ సబ్జెక్ట్‌తో ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్‌కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
 
వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనుష్క కుమార్‌ కెమెరా విభాగం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
త్వరలో సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments