Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రిష‌బ్ పంత్‌కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు: సునీల్ గవాస్కర్

Advertiesment
రిష‌బ్ పంత్‌కు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు: సునీల్ గవాస్కర్
, సోమవారం, 17 జనవరి 2022 (10:49 IST)
టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో టీమిండియా త‌దుప‌రి టెస్టు కెప్టెన్ ఎవ‌ర‌నే అంశంపై తాజాగా భార‌త క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ స్పందించారు. ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో భార‌త జ‌ట్టు త‌ర్వాతి టెస్టు కెప్టెన్‌గా యువ ఆట‌గాడైనా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ఉండాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. యువ ఆట‌గాడైనా రిష‌బ్ పంత్‌కు ఆ అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా భార‌త జ‌ట్టుకు సుదీర్ఘ కాలం పంత్ కెప్టెన్‌గా ఉండ‌డానికి అవ‌కాశం ఉంటుందని తెలిపారు.
 
అలాగే ఐపీఎల్‌లో రికీ పాంటింగ్ ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా త‌ప్పుకున్న‌ప్పుడు రోహిత్ శ‌ర్మ‌కు ఆ బాధ్య‌త అప్ప‌గించార‌ని గ‌వాస్క‌ర్ గుర్తు చేశారు. దీంతో రోహిత్ కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్‌లోనూ బాగా రాణించాడ‌ని చెప్పుకొచ్చారు. అలాగే రిష‌బ్ పంత్‌కు కూడా టీమిండియా కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే కెప్టెన్సీతోపాటు బ్యాటింగ్‌లోనూ మ‌రింత‌ రాణించ‌గ‌లుగుతాడ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.
 
ఇప్పటి వరకు తన క్రికెట్ కెరీర్‌లో 28 టెస్టు మ్యాచ్‌లు ఆడిన 39 స‌గ‌టుతో 1735 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 సెంచ‌రీలు, 7 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 159 ప‌రుగులు. ఇక 18 వన్డే మ్యాచ్‌ల్లో 33 స‌గ‌టుతో 529 ప‌రుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచ‌రీలు ఉండ‌గా, అత్య‌ధిక స్కోర్ 78 ప‌రుగులు. కాగా 41 టీ20 మ్యాచ్‌ల్లో 23 స‌గ‌టుతో 623 ప‌రుగులు చేశాడు. 2 హాఫ్ సెంచ‌రీలు చేయ‌గా.. అత్య‌ధిక స్కోర్ 65 ప‌రుగులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత బ్యాడ్మింటన్‌లో కొత్త కెరటం... టైటిల్ విజేతగా లక్ష్యసేన్