Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఇయ‌ర్స్ కెరీర్లో ఇదే బెస్ట్ అంటోన్న జ‌గ్గుభాయ్..!

అడివి శేష్, శోభిత జంట‌గా రూపొందిన గూఢ‌చారి చిత్రానికి శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో న‌టించిన జ‌గ‌ప‌తిబాబు 30 ఇయ‌ర్స్ కం

Webdunia
బుధవారం, 15 ఆగస్టు 2018 (14:31 IST)
అడివి శేష్, శోభిత జంట‌గా రూపొందిన గూఢ‌చారి చిత్రానికి శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ,  అభిషేక్ పిక్చ‌ర్స్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమాలో న‌టించిన జ‌గ‌ప‌తిబాబు 30 ఇయ‌ర్స్ కంప్లీట్ చేసుకున్న సంద‌ర్భంగా గూఢ‌చారి టీమ్ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది. 
 
ఈ వేడుక‌లో జ‌గ‌ప‌తిబాబు మాట్లాడుతూ... హీరోగా ఒక్క సినిమా చేస్తే చాలు.. అనుకంటే ముప్పై ఏళ్లు.. ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, మీడియా, ప్రేక్ష‌కులు అంద‌రు న‌న్ను ఎంత‌గానో స‌పోర్ట్ చేసి ఇంతవ‌ర‌కు తీసుకువ‌చ్చారు. న‌న్ను ఇక్క‌డ ఇలా నిల‌బెట్టినందుకు.. అంద‌రికీ మ‌న‌స్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఆ రోజు నా ఫ‌స్ట్ మూవీకి చిరంజీవి గారు క్లాప్ కొట్టారు. నా ఫ‌స్ట్ షాట్ స్కేటింగ్ చేసుకుంటూ రావాలి.
 
ఫ‌స్ట్ షాట్ చేస్తున్న‌ప్పుడు ... అంద‌రిలాగ నేను కూడా ఒక స్టార్ పుట్ట‌బోతున్నాడు అని ఫీల‌య్యాను. ఆ త‌ర్వాత తెలిసింది. ఫ్లాప్ స్టార్ అని. ప‌ది ప‌న్నెండు సినిమాలు ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఆ త‌ర్వాత హిట్స్ సాధించి ఇప్పుడు ఇలా ఉన్నానంటే... చాలా సంతోషంగా ఉంది అన్నారు.
 
ఇక గూఢ‌చారి గురించి చెప్పాలంటే... నా మీద ఒట్టు 30 ఇయ‌ర్స్‌లో నేను గ‌డిపిన బెస్ట్ ఈవినింగ్ అంటే ఈ వేడుకలో పాల్గొన‌డ‌మే. ఎందుకంటే...‌ నాకు లైఫ్‌లో యాక్టింగ్ అస‌లు రాదు. కెమెరా ముందే న‌టిస్తాను. ఈ ఫంక్ష‌న్ నా కోసం చేసారంటే... టీమ్ అంద‌రికీ న‌మ‌స్కారం. ఈ సినిమాకి వీళ్లు ప‌డ్డ క‌ష్టం చూసిన‌ప్పుడు ఎంత ముచ్చ‌టేసిందంటే... ఇటువంటి టీమ్‌తో ప‌ని చేసాన‌నే గ‌ర్వం ఇప్ప‌టికీ ఉంది అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టిస్తున్న వినయ్ నర్వాల్‌కు భార్య వీడ్కోలు (Video)

పహల్గామ్ ఘటన ఊచకోత ... మతం అడిగి హతమార్చడం దారుణం : ఓవైసీ

పహల్గామ్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ హైకోర్టు జడ్జీలు!!

అఘోరీకి బెయిల్ ఎపుడు వస్తుందో తెలియదు : లాయర్ (Video)

Pahalgam Terrorist Attack పహల్గామ్ దాడితో కాశ్మీర్ పర్యాటకం నాశనం: తిరుగుముఖంలో పర్యాటకులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments