Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

దేవీ
గురువారం, 20 మార్చి 2025 (17:45 IST)
Sidhu Jonnalagadda, Vaishnavi Chaitanya, BVSN Prasad
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కిస్ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ను మేకర్స్ గురువారం రోజున విడుదల చేశారు.
 
హీరో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘మూవీకి ‘జాక్ - కొంచెం క్రాక్’ అనే టైటిల్ పెట్టటానికి కారణం.. రైమింగ్ తో పాటు హీరో క్యారక్టరైజేషన్. సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రతి మనిషి లైఫ్ లో ఓ గోల్ ఉంటుంది. అయితే ఏ పని చేస్తున్నామనే దాంతో పాటు ఆ పనిని మనం ఎలా చేస్తున్నామనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓ పనిని ఇలానే ఎందుకు చేయాలి.. మరోలా నేను చేస్తానని కొందరు అంటుంటారు. అలాంటి వాడిని చూస్తే మనం క్రాక్ అంటుంటాం. అందుకనే ఈ టైటిల్ పెట్టాం. హీరో క్యారెక్టరైజేషన్ గురించి భాస్కర్ గారు చెప్పగానే నచ్చి సినిమా చేయటానికి ఒప్పుకున్నాను.  నేను కూడా రైటర్‌ని కాబట్టి కొన్ని ఇన్‌పుట్స్ ఇచ్చాను.. దాన్ని భాస్కర్‌గారు ఆయన కథకు అనుగుణంగా డెవలప్ చేశారు. ప్రేక్షకులను నవ్విస్తూనే రెస్పాన్సిబుల్‌తో ఉండే పాత్రలో కనిపిస్తాను. ఏప్రిల్ 10న మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.
 
నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘సిద్ధు యూత్‌లోనే కాదు.. అన్నీ ఏజ్‌ల వారికి స్టార్ బాయ్‌గా మారారు. ‘జాక్’ సినిమాను భాస్కర్ చాలా చక్కగా హ్యాండిల్ చేశాడు. గ్యారంటీగా మంచి సినిమా అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
 
హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ ‘‘ఇంత మంచి పాటను రాసిన సనారెకి థాంక్స్. యూత్‌కి కనెక్ట్ అయ్యేలా పాటను రాశారు. ఇంత మంచి ట్యూన్ ను అందించిన సురేష్ గారికి. డైరెక్టర్ భాస్కర్ గారికి థాంక్స్. ఏప్రిల్ 10న మా జాక్ మూవీ థియేటర్స్ లోకి వస్తుంది. మీకు సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments