Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ సీజన్ 7: కెవ్వు కార్తీక్ ఎంట్రీ

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (22:28 IST)
బిగ్ బాస్ సీజన్ 7లో ఊహించని పరిణామం చోటుచేసుకోనుంది. అదే సమయంలో వైల్డ్ కార్డ్ ద్వారా 5 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 8 ఆదివారం మరో లాంచ్ ఈవెంట్ జరుగుతుండగా.. దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. 
 
గతంలో ఎప్పుడూ చేయని ఈ ప్రయోగం ప్రేక్షకులకు కిక్ ఇస్తుందని అంటున్నారు. సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి, సంగీత దర్శకుడు భోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, సీరియల్ నటి నాయని పావని వైల్డ్ కార్డ్ లిస్ట్‌లో ఉన్నారు.
 
అయితే చివరి నిమిషంలో అంజలి పవన్ వారి నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో జబర్దస్త్ స్టార్ కమెడియన్ కెవ్వు కార్తీక్‌ని లైన్‌లోకి తీసుకున్నారు. 
 
బిగ్ బాస్ షోలోకి కెవ్వు కార్తీక్ ఎంట్రీ దాదాపు ఖరారైందని టాక్. గతంలో బిగ్ బాస్ షోలో చాలా మంది జబర్దస్త్ కమెడియన్లు పాల్గొన్నారు. సీజన్-4లో నూక అవినాష్ పాల్గొన్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ హౌస్‌లో సక్సెస్ ఫుల్ జర్నీ సాగింది.
 
ఇక గత సీజన్‌లో ఇద్దరు జబర్దస్త్ కమెడియన్లు ఇంట్లోకి వెళ్లారు. చలాకీ చంటి మరియు ఫైమా పోటీదారులుగా ప్రవేశించారు. అంచనాల నడుమ అడుగుపెట్టిన చలాకీ చంటి ఫెయిల్ అయ్యాడు. మరి కార్తీక్ ఇంట్లోకి కెవ్వు కార్తీక్ అడుగుపెట్టడం నిజమైతే ఏ మేరకు సత్తా చాటుతాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments