Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన మ్యాడ్ చిత్ర బృందం

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (18:56 IST)
MAD team
ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'మ్యాడ్'. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు.

ఈ వినోదాత్మక చిత్రంలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు(అక్టోబర్ 6న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. షో షోకి వసూళ్ళను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
 
ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. "అందరూ కొత్త వాళ్ళు కలిసి చేసిన ప్రయత్నమిది. సినిమా బాగుంది, ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్మకంతో.. ఈ సినిమాకి అంత కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేశాము. కొత్త వాళ్ళు నటించిన ఈ సినిమాకి ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉంది. ఇలాంటి సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చింది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రాబొయ్యే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబడుతుంది. మీడియా నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించింది. మీడియా స్పందన పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నాం" అన్నారు.
 
దర్శకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. "ఇది నా మొదటి సినిమా. అందరం యంగ్ స్టర్స్ కలిసి చేశాం. వంశీ అన్న ఒక్కటే మాట చెప్పాడు.. గట్టిగా కొడుతున్నాం. ఆయన అన్నట్టుగానే జరిగింది. పాజిటివ్ టాక్ రావడంతో చాలా సంతోషంగా ఉంది" అన్నారు.
 
సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. "మా గురించి జనాలు మాట్లాడుకోవడం అనేది మా ఫస్ట్ సక్సెస్. మంచిగా మాట్లాడుకోవడం అనేది మా సెకండ్ సక్సెస్. చాలా హ్యాపీగా ఉంది. వంశీ అన్న ఒక మాట అంటారు. పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటాం, గట్టిగా కొడతాం అని. నిజంగానే గట్టిగా కొట్టాం" అన్నారు.
 
నార్నే నితిన్ మాట్లాడుతూ.. "సినిమా చాలా బాగా వచ్చింది, బాగా ఆడుతుంది అని ముందే ఊహించాం. కానీ ఈ స్థాయి రెస్పాన్స్ మాత్రం అసలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు. థియేటర్లలో ప్రతి ఒక్కరు సినిమాని ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు" అన్నారు.
 
రామ్ నితిన్ మాట్లాడుతూ.. "నాకింకా కలలో ఉన్నట్లు ఉంది. ఇంతమంచి సినిమాతో పరిచయం అవుతానని అసలు ఊహించలేదు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుంది. ఒక గొప్ప సినిమాలో భాగం అయ్యాననే భావన నాలో ఉంది." అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments