Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ శాంతిస్వరూప్ గురించి అసలు నిజం...

జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి లైఫ్ ఇస్తోంది. ఆ కార్యక్రమంలో నటిస్తున్న వారికి సినిమా ఛాన్సులు తన్నుకుంటూ వస్తున్నాయి. అందులో శాంతిస్వరూప్ ఒకరు. ఆడ వేషంలో శాంతిస్వరూప్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. పెద్దగా డైలాగ్‌లను చెప్పకున్నా తన హా

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (19:09 IST)
జబర్దస్త్ కార్యక్రమం ఎంతోమందికి లైఫ్ ఇస్తోంది. ఆ కార్యక్రమంలో నటిస్తున్న వారికి సినిమా ఛాన్సులు తన్నుకుంటూ వస్తున్నాయి. అందులో శాంతిస్వరూప్ ఒకరు. ఆడ వేషంలో శాంతిస్వరూప్‌ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. పెద్దగా డైలాగ్‌లను చెప్పకున్నా తన హావభావాలతో స్వరూప్ చేసే నటన ఇట్టే ఆకట్టుకుంటుంది. శాంతి స్వరూప్‌కు సినిమాల్లో అవకాశం రాకున్నా జబర్దస్త్‌తోనే ఎంతో ప్రశాంతంగా ఉన్నానంటున్నాడు స్వరూప్. ఆ కార్యక్రమంలో వచ్చే డబ్బులతో ఇప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకున్నానని చెప్పాడు.
 
అయితే జబర్దస్త్‌కు ముందు తన పరిస్థితిని తలుచుకుని ఇప్పటికీ బాధపడుతున్నాడని చెబుతున్నాడు శాంతి స్వరూప్. తినడానికి తిండి లేక, గదికి అద్దెను చెల్లించలేక తను పడిన బాధ వర్ణనాతీతం. తన బట్టల బ్యాగుతో రోడ్డుపైన పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఒక దర్శకుడు తనను చేరదీసి తన స్నేహితుని గదిలో 9 నెలల పాటు ఉంచి తన బాగోగులు చూసుకున్నాడట.
 
ఆయనను తను ఎప్పటికీ మరిచిపోను. అంతేకాదు ఆ దర్శకుడే తనకు జబర్దస్త్‌లో ఛాన్సు కూడా వచ్చేట్లు సహాయపడ్డారంటూ శాంతిస్వరూప్ చెప్పారు. శాంతి స్వరూప్ ఒక్కరే కాదు.. జబర్దస్త్‌లో ఇలా ఎన్నో ఇబ్బందులు పడ్డవారు లేకపోలేదు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments