చెన్నై చంద్రంగా పేరుగాంచిన నటి త్రిష ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై ఓ తమిళ నిర్మాత ఫిర్యాదు చేశాడు. 'సామి 2' చిత్ర నిర్మాత శిబు థమీన్స్ నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Advertiesment
, మంగళవారం, 9 జనవరి 2018 (16:46 IST)
చెన్నై చంద్రంగా పేరుగాంచిన నటి త్రిష ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై ఓ తమిళ నిర్మాత ఫిర్యాదు చేశాడు. 'సామి 2' చిత్ర నిర్మాత శిబు థమీన్స్ నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
గత 2003లో విక్రమ్ హీరోగా వచ్చిన చిత్ర 'సామి'. ఈ చిత్రం చిత్రానికి సీక్వెల్‌గా 'సామి 2' చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిషని కథానాయికగా ఎంచుకున్నారు. కొద్ది రోజులు షూటింగ్‌లో పాల్గొన్న ఈ అమ్మడు ఇతర కారణాల వలన సినిమా నుండి తప్పుకుంది.
ఈ నేపథ్యంలో కథానాయికగా కీర్తి సురేష్‌ను సెలక్ట్ చేశారు. అయితే సినిమా నుండి అర్ధంతరంగా తప్పుకొని తమని చాలా నష్టపరచిన త్రిషపై కఠిన చర్యలు తీసుకోవాలని శిబు నడిఘర్ సంఘంలో ఫిర్యాదు చేశాడట. మరి దీనిపై నడిఘర్ సంఘం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.