Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లి 'మెగాస్టార్' ప్రక్కన ఛాన్స్ కొట్టేసిన కుమారి 21F భామ...??

మెగాస్టార్ ప్రక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది కుమారి 21F హీరోయిన్ హెబ్బా పటేల్. అదేమిటి చిరంజీవి సరసన ఈమె నటిస్తుందా అని ఆశ్చర్యపోతున్నారా?? అదేమి లేదండీ.. మీకు చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో చిరంజీవి చిన్నప్పటి పాత్రను పోషించిన మ

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (18:47 IST)
మెగాస్టార్ ప్రక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది కుమారి 21F హీరోయిన్ హెబ్బా పటేల్. అదేమిటి చిరంజీవి సరసన ఈమె నటిస్తుందా అని ఆశ్చర్యపోతున్నారా?? అదేమి లేదండీ.. మీకు చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో చిరంజీవి చిన్నప్పటి పాత్రను పోషించిన మాష్టర్ తేజా సజ్జా గుర్తున్నాడా? గతంలో చాలా సినిమాలలో బాల నటుడిగా నటించిన తేజా, ఇప్పుడు హీరోగా మన ముందుకు రానున్నాడు. అయితే ఆ చిత్రంలో నటించడానికి హెబ్బా సంతకం చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 
 
గతేడాది హెబ్బా నటించిన మిస్టర్, ఏంజెల్ మరియు అంధగాడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఇప్పుడు హెబ్బా చేతిలో అవకాశాలు పెద్దగా లేవు. కనుక ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'మిణుగురులు' సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అయోధ్య కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక తేజా సజ్జాకి తెలుగు సూపర్‌స్టార్‌లతో కలిసి నటించిన అనుభవం ఎలాగూ ఉంది. 
 
చిరంజీవితో చూడాలనివుంది, ఇంద్ర, ఠాగూర్ సినిమాలలో నటించిన తేజాకి మెగాస్టార్ ఆశీస్సులు కూడా ఉన్నాయని టాలీవుడ్‌లో టాక్. ఇప్పటివరకూ హీరోలుగా మారిన ఎంతోమంది బాలనటులు సరైన హిట్లు లేక సైడ్ అయిపోయారు. అందులో కొంతమంది మాత్రమే నిలదొక్కుకోగలిగారు. బాలనటుడిగా నటించిన తేజా హీరోగానూ సక్సెస్ అవుతారో లేదో చూడాలి మరి.

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments