Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్ల‌రి న‌రేష్ హీరోగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

Allari naresh
Webdunia
మంగళవారం, 10 మే 2022 (17:01 IST)
Allari naresh
కామెడీ చిత్రాల‌తో క‌డుపుబ్బా న‌వ్వించిన నేటి త‌రం కామెడీ స్టార్ అల్ల‌రి నరేష్‌. కామెడీ చిత్రాలే కాదు.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌, గమ్యం, నాంది వంటి వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లోనూ న‌టించి న‌టుడిగా మెప్పించారాయ‌న‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. అల్లరి నరేష్ 59వ చిత్రమిది.
 
సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, రిప‌బ్లిక్‌, బంగార్రాజు వంటి వ‌రుస స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో, మ‌రో నిర్మాణ‌ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండు నిర్మాత‌. బాలాజీ గుత్త స‌హ నిర్మాత‌. ఆనంది హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.
 
మంగళవారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. పోస్టర్ గ‌మ‌నిస్తే.. నరేష్ మంచం ఓ చివరన పట్టుకుని ముందుకెళుతున్నట్లు కనిపిస్తుంది. అంటే ఎవరినో నరేష్ మోస్తున్నట్లు అనిపిస్తుంది.  తలకు, చేతికి గాయాలు కనపడుతున్నాయి. నరేష్ ఓ ఇన్‌టెన్స్ లుక్‌తో కనిపిస్తున్నారు.
 
సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు.
 
వెన్నెల కిషోర్‌, ప్ర‌వీణ్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అబ్బూరి ర‌వి ఈ చిత్రానికి మాట‌ల‌ను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిట‌ర్‌. బ్ర‌హ్మ క‌డ‌లి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా, యాక్ష‌న్ డైరెక్ట‌ర్‌గా పృథ్వి వ‌ర్క్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొరుగు రాష్ట్రాలకు అమరావతి కేంద్రంగా మారనుంది.. ఎలాగంటే?

ఫహల్గామ్ ఘటన.. తిరుమలలో అలెర్ట్- టీటీడీ యంత్రాంగం అప్రమత్తం (video)

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments