Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుమ్ము దులుపుతున్న 'ఇస్మార్ట్ శంకర్'.. మరో 'పోకిరి' అవుతుందా?

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (13:30 IST)
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం "ఇస్మార్ట్ శంకర్". ఈ చిత్రం విడుదలైన ప్రతిచోటా మొదటి ఆట నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుంది. ఫలితంగా కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. దీనికితోడు విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం "డియర్ కామ్రేడ్". ఈ చిత్రం తాజాగా విడుదలైనప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అదేసమయంలో విడుదలైన ఇతర సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేక పోవడం 'ఇస్మార్ట్ శంకర్‌'కు కలిసివచ్చింది. 
 
దీంతో 'ఇస్మార్ట్ శంకర్' కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం గత 12 రోజుల్లోనే ఏకంగా 65 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌ను వసూలు చేయగా, రూ.30 కోట్లకు పైగా షేర్‌ను రాబట్టింది. ముఖ్యంగా, ఒక్క నైజాం ఏరియాలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల మేరకు వసూళ్లను సాధించి హీరో రామ్ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. 
 
నిజానికి పూరీ జగన్నాథ్‌కు గత కొన్ని నెలలుగా సరైన హిట్ లేకపోవడంతో అతని కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో రామ్‌ హీరో సీనియర్ హీరోయిన్ చార్మి సహ నిర్మాతగా 'ఇస్మార్ శంకర్' చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పూరీ కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా, గతంలో పూరీ - మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి చిత్రం తరహాలో వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments