Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ హీరోయిన్‌ను టార్చర్ పెడుతున్న హీరో... కంప్లైంట్

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (13:25 IST)
హీరోహీరోయిన్లు ఓ చిత్రంలో నటిస్తే స్నేహంగా వుండటం మామూలే. ఐతే ఆ స్నేహాన్ని ఆసరాగా తీసుకుని యువ తనను ప్రేమించాలంటూ ఓ హీరోయిన్‌కి టార్చర్ పెడుతున్నట్లు సదరు నటి తల్లి కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే... తమిళ దర్శకుడు బాలా శిష్యుడు నందన్ సుబ్బరాయన్ 'మయూరాన్' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో అముదవానన్, మిస్ ఇండియా ఫెమీనా కిరీటాన్ని కైవసం చేసుకున్న అశ్మిత హీరోహీరోయిన్లు. చిత్రం పూర్తయింది. ఈ చిత్రం ఈ శుక్రవారం నాడు విడుదల కాబోతోంది. కాగా ఈ చిత్రం ప్రమోషన్ కోసం హీరోహీరోయిన్లు రాకుండా మొండికేశారు.
 
దీంతో షాక్ తిన్న దర్శకనిర్మాతలు ఎందుకు రావడంలేదని అడిగితే... తన కుమార్తెను హీరో ప్రేమ పేరుతో టార్చర్ పెడుతున్నాడనీ, తనను ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని హీరోయిన్ అశ్మిత తల్లి కంప్లైంట్ ఇచ్చింది. ఐతే హీరో అముదవానన్ మాత్రం దీన్ని ఖండించాడు. చిత్రం ప్రమోషన్‌కి హీరోయిన్ రాకపోతే తనెందుకు రావాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నాడట. వాళ్లిద్దరి విషయం ఏమోగానీ తమ చిత్రానికి ప్రమోషన్ లేకుండా విడుదలవుతోందనీ, ఎలా ఆడుతుందో ఏమోనని చిత్ర దర్శకనిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments