Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జియో మరో సంచలనం : రూ.600కే అన్ని సేవలు

Advertiesment
జియో మరో సంచలనం : రూ.600కే అన్ని సేవలు
, మంగళవారం, 30 జులై 2019 (13:54 IST)
దేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో మరో సంచలనానికి నాందిపలుకనుంది. ప్రతి యేడాది ఆ సంస్థ నిర్వహించే వార్షిక సమావేశంలో తమ యూజర్లకు ఓ శుభవార్త చెబుతూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆగస్టు 12వ తేదీ నుంచి రిలయన్స్ జియో గిగా ఫైబర్ సేవలను ప్రారంభించనుంది. కేవలం రూ.600కే మూడు రకాల సేవలందించేందుకు సిద్ధమైంది. ఈ గిగా ఫైబర్ సర్వీసులతో ల్యాండ్ లైన్ కనెక్షన్, 1జీబీపీఎస్ స్పీడ్‌తో బ్రాడ్ బ్యాండ్, 600 టీవీ ఛానళ్లను అందిస్తుంది. 
 
అయితే, ఓఎస్టీ డివైస్ కోసం రూ.4500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ కింద వసూలు చేస్తారు. కనెక్షన్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి వెనక్కి చెల్లిస్తారు. పేమెంట్ కోసం ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఆప్షన్లు కూడా ఉంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాన్‌పిక్ భూముల స్కామ్ : నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టు