ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో అరెస్టు అయ్యారు. విహారయాత్రకు వెళ్లిన ఆయన్ను సెర్బియా పోలీసులు అరెస్టు చేశారు. వాన్‌పిక్ భూముల కుంభకోణం కేసులో రస్ అల్ ఖైమా కంపెనీకి చెందిన ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదుతో బెల్‌గ్రేడ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
వాన్ పిక్ భూముల వాటాల విషయంలో రస్ అల్ ఖైమాకు, నిమ్మగడ్డకు విభేదాలు ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సెర్బియాకు విహారయాత్రకు వెళ్లిన నిమ్మగడ్డను రస్ అల్ ఖైమా ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.