ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ నెట్‌ఫ్లిక్స్ దేశంలోని తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇకపై చౌక ధరకే నెలవారీ ప్లాన్‌ను అందజేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ క్రమంలో నెలకు రూ.250 ధరకు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను అందించేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్దమవుతోంది.
ప్రస్తుతం అమెజాన్, హాట్‌స్టార్ తదితర వీడియో స్ట్రీమింగ్ యాప్‌లలో చాలా తక్కువ ధరకే నెలవారీ, వార్షిక ప్లాన్‌లను అందిస్తున్నారు. అమెజాన్‌లో నెలకు రూ.129, ఏడాదికి రూ.999 ప్లాన్‌ను అందిస్తుండగా, హాట్‌స్టార్‌లో నెలకు రూ.199, ఏడాదికి రూ.999 ప్లాన్‌లను అందిస్తున్నారు.
కానీ నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం నెలకు బేసిక్ ప్లానే రూ.500 నుంచి మొదలవుతుంది. దీంతో తమ స్ట్రీమింగ్ యాప్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. గత 3 నెలల కాలంలో తాము అనుకున్న దానికన్నా చాలా తక్కువ మంది సబ్‌స్క్రైబర్లు దేశంలో చేరారని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
అందువల్లే తక్కువ ధరకే నూతనంగా ఓ ప్లాన్‌ను కేవలం భారత కస్టమర్లకే త్వరలో అందుబాటులోకి తేనున్నామని ఆ సంస్థ వెల్లడించింది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చవకైన బేసిక్ ప్లాన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో చూడాలి..!