Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

దేవీ
శనివారం, 15 నవంబరు 2025 (19:04 IST)
SS Rajamouli
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పేరు ఖరారు చేయడానికి ఈరోజు రామోజీ ఫిలింసిటీలో  గ్లోబ్ ట్రాటర్ పేరుతో ఈవెంట్ ప్రారంభంఅయింది. ఫిలింసిటీ బయట గల ప్రాంతంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. బాహుబలి చిత్రం తీసిన వెనుక భాగంలో సెట్ వేసి తీర్చిదిద్దారు. దీనికోసం నేషనల్ మీడియాతోపాటు  విదేశాల నుండి కూడా అభిమానులు వస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి బారీగా ప్లాన్ చేసినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి.
 
ఆస్ట్రేలియా పెర్త్‌కి చెందిన సునీల్ అవుల అనే ఓ అభిమాని ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం 12 గంటల ప్రయాణం చేసి హైదరాబాద్‌కి చేరుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన డెడికేషన్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోగా, ఎస్ఎస్.కార్తికేయ కూడా స్పందించారు. ఇది అరుదైన సంఘటన. మహేష్ బాబుపై అభిమానుల ప్రేమ, ఈ సినిమా కోసం ఉన్న ఉత్సాహం ఏ స్థాయిలో ఉందో ఇది స్పష్టం చేస్తోంది అన్నారు.
 
ఇక ఇటీవలే ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలను పరిచయం కుంభా, మందాకిని పోస్టర్లు విడుదలచేశారు. నేడు మహేష్ బాబు పేరు ను కూడా రిలీవ్ చేస్తూ టైటిల్ ప్రకటించనున్నారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై చాలా కాలం గేప్ తర్వాత కె.ఎల్. నారాయణ, గోపాల్ రెడ్డి నిర్మాతలు. 
 
ఇదిలా వుండగా, ఈ సినిమాను రెండు భాగాలుగా తీయాలన్న ఆలోచనకు నిర్మాతల నుంచి బ్రేక్ పడింది. ఒక్క పార్ట్ లోనే పూర్తిచేయాలని రూల్ పెట్టినట్లు తెలిసింది. అందుకే త్వరగా సినిమాను పూర్తిచేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఖాతా తెరిచిన బీఎస్పీ.. అదీ కూడా 30 ఓట్ల మెజార్టీతో..

సీఐఐ సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments