SSMB29 చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా ఆ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. గ్లోబ్ ట్రాటర్ (Globetrotter) అనే చిత్ర టైటిల్‌తో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా లుక్ ఆకట్టుకునేవిధంగా వుంది. సాంప్రదాయ చీర కట్టులో వున్న ప్రియాంకా చోప్రా చేతిలో మాత్రం తుపాకీని పట్టుకుని ఫైర్ చేస్తోంది. ఈ స్టిల్ ను షేర్ చేస్తూ రాజమౌళి.. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్వచించిన మహిళ అయిన దేశీ గర్ల్‌కి తిరిగి స్వాగతం, మందాకినిని అనేక షేడ్స్ ను ప్రపంచానికి పరిచయం చేయలేకుండా వుండలేకపోతున్నానంటూ పేర్కొన్నారు.
కాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, టీజర్ రిలీజ్ వేడుకను ఈ నెల 15న రామోజీ ఫిలిమ్ సిటీలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. బాహుబలి తర్వాత ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబ్ ట్రాటర్ చిత్రంలో మహేష్ బాబు, ప్రియాంకా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.