Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సలార్'లో జగపతి బాబు : రాజమనార్‌గా జగ్గూభాయ్

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (12:48 IST)
హీరో ప్రభాస్ బాహుబలి తర్వాత నటించిన చిత్రం 'సాహో'. ఈ చిత్రం తర్వాత ఆయన వరుస ప్రాజెక్టులను చేపట్టారు. ప్రస్తుతం ఆయన చేతిలో 'రాధే శ్యామ్', 'స‌లార్', 'ఆది పురుష్', 'ప్రాజెక్ట్ కె' అనే సినిమాలు ఉన్నాయి. 
 
వీటిలో స‌లార్ చిత్ర విష‌యానికి వ‌స్తే.. ఈ చిత్రాన్ని ‘కె.జి.యఫ్’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్లో ‘కె.జి.యఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.
 
అయితే, ‘కె.జి.యఫ్’ కి పది రెట్లు మించి స‌లార్ ఉంటుందని ప్రశాంత్ ప్రకటించారు. అప్పటి నుంచి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కొద్ది రోజులుగా ఈ సినిమాలో వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి నటిస్తున్నారని ప్ర‌చారం జ‌రుగుతుంది. 
 
ఈ సినిమాలో ఆయనది మెయిన్ విలన్ క్యారెక్టర్ అంటున్నారు. తాజాగా స‌లార్ టీం నుండి అనౌన్స్‌మెంట్ రాగా, రాజ‌మ‌నార్ అనే పాత్ర‌ను సోమవారం ఉద‌యం 10.30ని.ల‌కు రివీల్ చేశారు. 
 
అంద‌రు మ‌నోజ్ భాజ్‌పాయ్ పోస్ట‌ర్ రివీల్ చేస్తార‌ని అనుకుంటున్నారు. ఇటీవల ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న మనోజ్.. ఇందులోని నటనకుగాను ‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2021’ బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ విన్ అయ్యారు. ఇప్పుడాయన ‘సలార్’లో విలన్‌గా ఎంత‌గా మెప్పిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భక్తి-ముక్తి, శక్తి-యుక్తి ఈ 4 అవసరం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో శ్రీశ్రీ రవిశంకర్ (video)

మగవాళ్లపై గృహహింస: ‘పెళ్లైన 15 రోజులకే విడాకులన్నారు, ఇంటికి వెళితే దారుణంగా కొట్టి పంపించారు’

జగన్ థర్డ్ డిగ్రీ నుంచి బీజేపీలో ఉండటంతో తప్పించుకున్నా : విష్ణుకుమార్ రాజు

పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ.. గుండెపోటుతో యువకుడి మృతి..

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments