Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఓబులమ్మ' గా రకుల్ : కొండపొలం నుంచి మరో స్టిల్

Webdunia
సోమవారం, 23 ఆగస్టు 2021 (12:47 IST)
ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కొండపొలం. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ శారు. ఇందులో వైష్ణవ్‌తేజ్‌ గడ్డంతో రఫ్‌లుక్‌లో కనిపించి ఆక‌ట్టుకున్నాడు. 
 
తాజాగా ఈ సినిమా నుండి రకుల్ ఫస్ట్‌ లుక్‌‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో రకుల్ పూర్తి గ్రామీణ యువతిగానే కనిపించింది. ర‌కుల్ లుక్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. నల్లమల అడవిలో సామాన్య గొర్రెలకాపరులు చేసే సాహసోపేతమైన జీవనపోరాటం ఇతి వృత్తంగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 8న థియేటర్స్‌లో విడుద‌ల చేయ‌నున్నారు.
 
కాగా, వైష్ణ‌వ్ తేజ్ రెండో సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం.. జ్ఞాన శేఖర్‌ ఛాయాగ్రహణం ప్రధాన ఆకర్షణగా నిలవ‌నున్నాయి. అటవీ నేపథ్యంలో అడ్వెంచరస్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో వైష్ణ‌వ్.. కటారు రవీంద్ర యాదవ్‌గా కనిపించనున్నారు. బల్లె ఓబులమ్మ అనే గ్రామీణ యువతిగా రకుల్‌ కనిపించనుంది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments