Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు

Advertiesment
Rayalaseema Lift Irrigation Project Works
, గురువారం, 24 జూన్ 2021 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని ఏపీ సర్కారును ఆదేశించింది. పైగా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సమర్పించిన తర్వాత దానికి ఆమోదం లభించేంత వరకు పనులు నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొంది. 
 
ఈ మేరకు  బోర్డు సభ్యుడు హెచ్‌కే మీనా ఏపీ జలవనరుల కార్యదర్శికి లేఖ రాశారు. పనులు చేపట్టవద్దంటూ ఫిబ్రవరిలో జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఈ లేఖలో గుర్తు చేశారు. 
 
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనులు జరుగుతున్నాయో, లేదో చెప్పాలని అప్పట్లో జాతీయ హరిత ట్రైబ్యునల్ కృష్ణాబోర్డు నిపుణుల కమిటీని ఆదేశించింది. అయితే, నిపుణుల కమిటీ పర్యటనకు ఏపీ అవకాశం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 
 
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులపై తెలంగాణ ప్రభుత్వం కూడా ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించాలని, అది ఆమోదం పొందాకే ప్రాజెక్టు విషయంలో ముందుకెళ్లాలని ఆ లేఖలో స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెరిగిసిన పసిడి ధరలు... తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయి?