Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్

డీవీ
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (12:26 IST)
festival invitation
భారతీయ సినిమా, ప్రపంచ సినిమా ఖ్యాతిని చాటడానికి, ,ప్రోత్సహించడానికి ఫిలిం ఫెస్టివల్స్ ను రెగ్యులర్ గా నిర్వహిస్తూ, ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ. గత 16 ఏళ్లుగా ఇండియన్ సినిమా, ప్రపంచ సినిమా వికాసానికి ఎంతో కృషి చేసిన ఈ సంస్థ నిన్నటి, నేటి, రేపటి సినిమా గురించి ఇంటర్నేషనల్ టార్చ్ కాంపెయిన్ పేరుతో  ఈ నెల 25వ తేదీ (గురువారం) హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్ , స్క్రీన్ నెంబర్ 5లో  సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించబోతోంది. 
 
ఈ విషయాన్ని  జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంస్థ చైర్మన్ హనురోస్ తెలిపారు. ప్రసాద్ మల్టీఫ్లెక్స్ సౌజన్యంతో, వారి వేదికపైన జరగబోయే ఈ కార్యక్రమంలో ప్రసాద్ గ్రూప్స్ చైర్మన్ శ్రీ రమేష్ ప్రసాద్ గారు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, రామోజీ ఫిలిం సిటీ సీఈఓ శేష సాయి, ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్, ఇంకా పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్లు హను రోస్ వెల్లడించారు. తెలుగు సినిమాతో పాటు  భారతీయ సినిమాలకు సంబంధించిన  ప్రపంచ సినిమా గురించి వక్తలు మాట్లాడతారని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments