Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తనను కామెంట్ చేయడంతో ఆ హీరోపై ఫైర్ అయిన నభా నటేష్

Advertiesment
Nabha Natesh

డీవీ

, సోమవారం, 22 ఏప్రియల్ 2024 (18:04 IST)
Nabha Natesh
హీరో హీరోయిన్లకు అసిస్టెంట్లు వుండడం మామూలే. తలదువ్వడానికి, మేకప్ వేయడానికి, గొడుగు పట్టడానికి, టిఫిన్ సర్వ్ చేయడానికి, కుర్చీలు వేయడానికి, వెంటవుండి నీల్లు, టానిక్ లు ఇవ్వడానికి ఇలా దాదాపు స్థాయిని బట్టి వుంటుంటారు. ఈ విషయంలో హీరోయిన్ నభా నటేష్ తక్కువేమీ కాదు.దాదాపు ఆరుగురు అసిస్టెంట్లు వున్నారు. వీరిగురించి హీరో ప్రియదర్శి కామెంట్ చేయడంతో నబా మండి పడి వెంటనే స్టేజీ మీద నుంచి వెళ్లి పోయింది.
 
ఇటీవలే నబానటేష్ నటించిన డార్లింగ్ (వాట్ ఈజ్ కొలవరీ) అనే సినిమా విడుదల ప్రమోషన్ లో హీరో ప్రియదర్శిలో చిట్ చాట్ చేస్తుండగా, ఎంతసేపటికీ రాకపోవడంతో ఒక మనిషికి ఆరుగురు అసిస్టెంట్లు వున్నా ఇంత ఆలస్యమా? నన్ను చూసి తెలుసుకో అన్నట్లు కామెంట్ చేయడంతో వెంటనే నబా మండిపడింది. నాగురించి సరిగ్గా తెలియకుండా మాట్లాడుతున్నావ్.  యాక్సిడెంట్ వలన కొంత కాలం సినిమాలు చేయలేదు. మళ్ళీ చేయడానికి ఇంతకాలం పట్టింది. కనీసం సానుభూతి లేకుండా నా అసిస్టెంట్లు గురించి కామెంట్లు చేస్తావా? అంటూ చిర్రుబుర్రులాడుతూ వెంటనే స్టేజీమీదనుంచి వెళ్ళిపోయింది. దాన్ని సర్ది చెప్పడానికి యాంకర్  మాట్లాడుతూ.. ఇలా సినిమాలోకూడా ఇద్దరూ భార్యభర్తల గొడవలు వుంటాయంటూ కవరింగ్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డైమండ్ వాచ్‌తో ఫోజులిచ్చిన సమంత.. ధర అక్షరాలా రూ.70లక్షలు?