Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 21 April 2025
webdunia

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ పెద్ద విజయాన్ని సాధించాలి : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Advertiesment
Priyadarshi  Nabha Natesh  Prashant Verma  Ashwin Ram   K Niranjan Reddy

డీవీ

, శనివారం, 20 ఏప్రియల్ 2024 (17:20 IST)
Priyadarshi Nabha Natesh Prashant Verma Ashwin Ram K Niranjan Reddy
హను-మాన్‌ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాత నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య సమర్పణలో తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశారు . బలగం, ఓం భీమ్ బుష్, సేవ్ ది టైగర్స్ సిరీస్‌ల విజయాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. నభా నటేష్ హీరోయిన్.  రొమ్-కామ్‌ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.  
 
ఈ చిత్రానికి 'డార్లింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 'వై దిస్ కొలవెరి' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ పెట్టారు. నభా నటేష్‌తో ప్రియదర్శి పెళ్లి ప్రపోజల్‌ని చూపించే ఫస్ట్‌లుక్ పోస్టర్ టైటిల్‌లాగే ఆహ్లాదకరంగా ఉంది. టైటిల్ అనౌన్స్మెంట్  గ్లింప్స్ ప్రియదర్శి , నభా నటేష్ మధ్య రిలేషన్ ని చూపుతుంది. ఇది పూర్తిగా హిలేరియస్ గా ఉంది.
 
సెలూన్‌లో ప్రియదర్శి, బార్బర్ మధ్య ఫన్నీ సంభాషణతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఎందుకు దిగులుగా వున్నావ్ అని బార్బర్  అడిగినప్పుడు..దర్శి జీవితంలోని వివిధ దశలలో ఆడవారి మనస్తత్వాలను చెబుతాడు. ఆడపిల్లలు తల్లులుగా ఉన్నప్పుడు ప్రేమగా, ఆప్యాయంగా వుంటారు. చెల్లాయిగా ఉన్నప్పుడు సపోర్టివ్ గా  వుంటారు. అదే అమ్మాయి ప్రేమికురాలిగా ఉన్నప్పుడు, క్యూట్‌గా, బబ్లీగా ఉండి మనల్ని చాలా అర్థం చేసుకుంటుంది. కానీ ఆ పిల్లే పెళ్ళాం అయితే మన జీవితాన్ని తలకిందులు చేసి తాట తీస్తుందని ప్రియదర్శి చెప్పడం, వెంటనే నభా నటేష్ చూపులతో, మాటలతో దర్శికి చుక్కలు చూపించడం హిలేరియస్ గా వుంది.
 
టైటిల్ అనౌన్స్మెంట్ గ్లింప్స్  డార్లింగ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ అవుతుందని హామీ ఇచ్చింది. మహేష్ బాబు పెదవే పలికిన పాత తన కొడుకుపై తల్లి ప్రేమను చూపించడానికి, పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నవంటే పాట అన్నదమ్ముల బంధాన్ని ప్రదర్శించడానికి,  ప్రభాస్ మెల్లగా కరగని పాట ప్రేమికుల మధ్య సాన్నిహిత్యాన్ని చూపించడానికి ఉపయోగించిన తీరు బావుంది. ఈ మొత్తం కాన్సెప్ట్ ఒక యూనిక్ ఆలోచన, వారి మధ్య జరిగే ఫైట్ కథనానికి కొత్త, కామిక్ దృక్పథాన్ని తెస్తుంది.
 
జనాదరణ పొందిన పాటల ద్వారా అమ్మాయిల మానసిక స్థితిని వర్ణించే టైటిల్ గ్లింప్స్ ఆలోచన దర్శకుడు అశ్విన్ రామ్ క్రియేటివిటీని  చూపుతుంది. హనుమాన్ నిర్మాతల నుంచి వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.
 
పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులఈ చిత్రానికి పని చేస్తున్నారు. నరేష్ డీవోపీ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. హేమంత్ డైలాగ్స్ రాయగా, లవ్ టుడే ప్రదీప్ ఈ రాఘవ్  చిత్రానికి ఎడిటర్. గాంధీ ప్రొడక్షన్ డిజైనర్.
 
టైటిల్ లాంచ్ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. దర్శితో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది. దర్శకుడిగా నా తొలి షాట్ దర్శి మీదే పెట్టాను. దర్శిని నా మొదటి హీరో. ఈ వేడుకు అతిధిగా రావడం ఆనందంగా వుంది. నిరంజన్ గారితో మూడేళ్ళుగా జర్నీ చేస్తున్నాం. చాలా పాషన్ వున్న నిర్మాత. మంచి కథ ఎక్కడున్నా వింటారు. హనుమాన్ లాంటి పెద్ద సినిమాని తీసే అవకాశం ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు. హనుమాన్ విడుదలకు సిద్ధమౌతున్న సమయంలో దర్శితో సినిమాని టేకప్ చేశారు. ఇంత మంచి కథని వదులుకోలేనని చెప్పారు. దర్శకుడు అశ్విన్ కి చాలా పాషన్, ఎనర్జీ వుంది. నభా లాంటి మంచి నటి ఈ ప్రాజెక్ట్ లో వుండటం అన్నీ సరిగ్గా సమకూరినట్లయింది. వివేక్ సాగర్ నాకు ఇష్టమైన కంపోజర్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. హను మాన్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యింది డార్లింగ్ కూడా అంతటి పెద్ద విజయాన్ని సాధించి నిరంజన్ గారికి మంచి, డబ్బు రావాలని, ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు నిర్మించాలని కోరుకుంటున్నాను.
 
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ..  ఈ వేడుకకు విచ్చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ప్రశాంత్ వర్మ. హర్ష, సునీల్ గారి ధన్యవాదాలు. నమ్ము నమ్మి ఈ కథని నాతొ చేస్తామని చెప్పి దానిపైనే నిలబడిన అశ్విన్ కి ధన్యవాదాలు. నిర్మాత నిరంజన్ గారు మాపై ఉంచిన నమ్మకం హనుమాన్ అంత బలాన్ని ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ తొందరలోనే వుంటుంది, వివేక్ సాగర్ అద్భుతంగా మ్యూజిక్ చేశాడు. ప్రభాస్ అన్నకి,  ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు. ప్రభాస్ గారిని ప్రేమతో పిలుచుకునే టైటిల్ ఈ సినిమాకి పెట్టడం మాకు చాలా గర్వకారణం. నభా తో నటించడం చాలా ఆనందంగా అనిపించింది. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్.  ఈ సినిమాతో ఖచ్చితంగా ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తాం. ఇది డార్లింగ్ ప్రామిస్' అన్నారు.
 
నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..    ఈ వేడుకకు విచ్చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ప్రశాంత్ వర్మ. హర్ష, సునీల్ గారి ధన్యవాదాలు. మా టీం అందరికీ థాంక్స్. దర్శకుడు అశ్విన్ నమ్మినది అద్భుతంగా తెరపై తీసుకొచ్చారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని నమ్ముతున్నాం' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పదిమందికి పని కల్పించడంలో చాలా ఆనందం వుంది: నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల