Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్‌లో ఒక్క సన్నివేశానికి 20 కోట్లు... జక్కన్నకే సాధ్యం...

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (19:12 IST)
ఒక సన్నివేశానికి 20 కోట్లు. బహుశా ఇలాంటి సినిమా ఇప్పటివరకు తెలుగు సినీపరిశ్రమలో వచ్చి ఉండదు. సినిమా చాలా భారీ బడ్జెట్. ఇద్దరు అగ్ర హీరోలు. ఒక ప్రముఖ దర్శకుడు. సినిమా షూటింగ్ వేగంగా ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతోంది. ఇప్పటికే అర్థమైఉంటుంది... అదేం సినిమానో.. ఆర్.ఆర్.ఆర్. 
 
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాను రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడ్యూసింగ్ సమయంలో ఒకే ఒక్క సీన్ కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారట. తెలుగు సినీ పరిశ్రమలో ఒక్క సన్నివేశానికి ఈ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కానీ రాజమౌళి ఒక్కసారి సినిమా స్టార్ట్ చేసిన తరువాత బడ్జెట్‌కు ఏమాత్రం కాంప్రమైజ్ కారన్నది నిర్మాతలకు బాగా తెలుసు.
 
ఎంత బడ్జెట్ ఖర్చవుతుందో అంతకు రెట్టింపు సినిమాలో సంపాదించుకోవచ్చుననేది నిర్మాతల ఆలోచన. అందుకే రాజమౌళి సినిమాలంటే నిర్మాతలు డబ్బులను చల్లేస్తారు. అస్సలు పట్టించుకోరు. అదే పరిస్థితి ఆర్.ఆర్.ఆర్‌లో కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లకు ఒక మంచి మైలేజ్‌గా ఈ సినిమా చిరస్థాయిగా మిగిలిపోయే అవకాశముందన్నది అభిమానుల ఆలోచన. అయితే ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు అనుకున్నారు కానీ ఒక హీరోయిన్ ఫారెన్ అమ్మాయి తాను నటించనని వెళ్ళిపోవడంతో మరొక హీరోయిన్ కోసం రాజమౌళి వెతుకుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: భార్యను గొంతుకోసి చంపేసిన క్యాబ్ డ్రైవర్.. ఆపై లొంగిపోయాడు.. కారణం ఏంటంటే?

తల్లి సాయంతో భర్తను హత్య చేసిన భార్య.. ఎలాగంటే?

Apsara Case: అప్సర హత్య కేసు.. పూజారికి రంగారెడ్డి కోర్టు జీవిత ఖైదు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు ఇవే... మంత్రి నాదెండ్ల

హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments