'ఆర్ఆర్ఆర్ లీక్స్‌కు అడ్డుకట్ట వేయలేరా?

శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (11:05 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి గాయం అవడం వల్ల బ్రేక్ పడిన ఎస్ఎస్. రాజమౌళి "ఆర్ఆర్ఆర్" అతి త్వరలో రీస్టార్ట్ కాబోతోంది. రెండు రోజుల్లో డాక్టర్లు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, చరణ్, తారక్‌లు కలిసి బయలుదేరుతారు. జక్కన్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ షేర్ కాకుండా చూసుకుంటున్నా, లీక్స్‌ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. అవి అభిమానులకు మంచి హుషారు ఇస్తుండటంతో అందరిలో ఆసక్తి మొదలైంది. 
 
తాజాగా వచ్చిన సమాచారం మేరకు గతంలో ఫస్ట్ షెడ్యూల్‌లో రామ్ చరణ్ ఇంట్రోని పూర్తి చేసిన జక్కన్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ది షూట్ చేయబోతున్నాడు. ఇది అయ్యాక అజయ్ దేవగన్ స్పెషల్ ఎపిసోడ్‌లోని ఇంట్రో కూడా ఓ రేంజ్‌లో తీయబోతున్నాడట. మొత్తం ఈ మూడు ఎపిసోడ్‌లకు కలిపి దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. 
 
5 నుంచి 10 నిమిషాల ఇంట్రో సీన్స్‌కే ఇంత ఖర్చు చేయబోతున్న జక్కన్న కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ని ఏ రేంజ్‌లో తీయబోతున్నాడో. 400 కోట్ల దాకా బడ్జెట్‌తో తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న మూవీగా రికార్డు సృష్టిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు లైఫ్ అఫ్‌పై, జంగల్ బుక్‌లాంటి సినిమాలు చేసిన టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. చరణ్ సరసన అలియా భట్ కన్ఫర్మ్ అయినా, 'ఆర్ఆర్ఆర్‌'లో జూనియర్ ఎన్టీఆర్ జోడిని ఇంకా సెట్ చేయాల్సి ఉంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఏమడిగినా తెలియదంటున్నాడు.. మెగా కాంపౌండ్‌లో మరీ ఇంత అమాయకుడా!