Webdunia - Bharat's app for daily news and videos

Install App

స‌ల్మాన్ స్పూర్తితో అఖిల్ కండ‌లు పెంచాడ‌ట‌!

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:37 IST)
Akhil Akkineni
అక్కినేని వార‌సుల్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో ప‌ల‌క‌రించిన అఖిల్ తాజాగా కండ‌లు చూపిస్తున్నాడు. ఇది ఏజెంట్ అనే సినిమా కోస‌మే అని చెబుతున్నాడు. గ‌తంలోనే తాను చేయ‌బోయే ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవ‌ల్‌లో వుంటుంద‌ని వెల్ల‌డించారు. తాజాగా ఈరోజు అఖిల్ కండ‌లు పెంచిన ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాహుబ‌లిలో రానా త‌ర‌హాలో కండ‌లు పెంచిన‌ట్లున్న అఖిల్ కండ‌లు స్పూర్తి మాత్రం స‌ల్మాన్ ఖాన్ అని తెలుస్తుంది. ఈరోజు స‌ల్మాన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. 
 
స‌హ‌జంగా కండ‌లు కోసం జిమ్‌కు వెళ్ళి క‌ష్డ‌ప‌డుతుంటారు. దానికోసం ర‌క‌ర‌కాలుగా పుడ్‌ను మెయింటెన్ చేస్తుంటారు. అఖిల్ తాజా సినిమా ఏజెంట్ లో  గూఢచారిగా నటిస్తున్నాడు. జేమ్ష్ బాండ్ త‌ర‌హాలో స్ట‌యిలిష్ లుక్ కాక‌పోయినా కండ‌ల‌తో అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. పొడవాటి జుట్టు, దట్టమైన గడ్డంతో తన కండరపుష్టిని పిక్ లో చూపించాడు.
 
తాజాగా మొద‌టి షెడ్యూల్ షూటింగ్ జ‌రిగింది. ఏజెంట్ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. సురేందర్ రెడ్డి దర్శకుడు కాగా, సాక్షి వైద్య కథానాయిక. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి కూడా న‌టిస్తున్నాడు. 20222 స‌మ్మ‌ర్‌లో మీ ముందుకు వ‌స్తున్న‌ట్లు అఖిల్ పోస్ట్‌లో తెలియ‌జేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాని మోడీగారూ.. మరోమారు ఓ కప్ అరకు కాఫీ తాగాలని ఉంది.. సీఎం చంద్రబాబు రిప్లై

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి వస్తారా? లేదా? డాక్టర్ సోమనాథ్ ఏమంటున్నారు...

డీకేను సీఎం చేయాలంటూ మతపెద్ద సలహా... కామెంట్స్ చేయొద్దన్న డీకే

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

రామథ్ కుంగిపోయింది.. అయోధ్యలో భక్తుల ఇక్కట్లు అన్నీఇన్నీకావు రామయ్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments