వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన సినిమా రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్.). కరోనా రాక ముందు నుంచి షూటింగ్ చేసిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జనవరిలో విడుదలతేదీ కూడా ఇచ్చేశారు. కానీ ఒమిక్రాన్ వైరస్ రావడంతో వెనుకంజ వేస్తారేమోనని అందరూ అనుకున్న అటువంటిది ఏమీలేదని తెలుస్తోంది. కానీ ఆర్.ఆర్.ఆర్. సినిమాకు థియేటర్ల సమస్య వచ్చి పడింది.
ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో సి సెంటర్లలో థియేటర్లు టిక్కెట్ల తగ్గించడంపై తమకు ఎటువంటి రాబడి రాదననీ, మరోవైపు టాక్స్ రెన్యువల్ పేరుతో అసలు సరైన ఒసతులులేవని అధికారులు కొన్ని థియేర్లను సీజ్ చేసేవారు. దాంతో చాలా థియేటర్లు మూతపడ్డాయి. ఆ ఎఫెక్ట్ నాని సినిమా `శ్యామ్ సింగరాయ్`పై పడింది. ఇక ఈరోజే విడుదలవుతున్న గుఢుపుఠాని సినిమాపై తీవ్రంగా పడింది. మాస్ ఏరియాల్లో ఆడే ఈ సినిమాకు థియేటర్లే లేవు. హైదరాబాద్‌లో గూఢుపుఠాని సినిమాకు కేవలం మూడు థియేటర్లే దొరికాయి. దాంతో నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఇక ఆ తర్వాత వచ్చే సినిమాలు ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద సినిమాలపై కేవలం ఆంధ్రలోనే ఎదురు దెబ్బతగలనుంది. వై.ఎస్. ప్రభుత్వం థియేటర్ల విషయంలో ససేమిరా అనడంతో నిర్మాతలు అంతా కలిసి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలో వున్నారు.
ఆర్.ఆర్.ఆర్. పాన్ ఇండియా కాబట్టి ఇప్పటి పరిస్థితులు రీత్యా ఈ సినిమా వాయిదా పడనుంది అని టాక్ వైరల్ అవుతుంది. మహారాష్ట్ర లో నైట్ కర్ఫ్యూ విధించారు అలాగే ఇదే బాటలో మన దక్షిణాదిలో కూడా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా నిబంధనలు పెట్టే సూచనలు లేకపోలేదేని వార్త హల్ చల్ చేస్తోంది. అందుకే ఆర్.ఆర్.ఆర్. సినిమా వాయిదా పడే సూచనలు ఉన్నాయని సరికొత్త టెన్షన్ మొదలైంది. మరి వేచి చూడాలి ఏం జరుగుతోంది అనేది.