Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రేన్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.కోటి సహాయం : కమల్ హాసన్

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (18:21 IST)
హీరో కమల్ హాసన్ - సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం భారతీయుడు-2. ఇది గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్. ఈచిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులోభాగంగా, చెన్నైలోని నెసప్పాక్కంలో ఉన్న ఈవీపీ స్టూడియోలో ఈ చిత్రం కోసం భారీ సెట్‌ వేసి, అక్కడ షూటింగ్ జరుపుతున్నారు. 
 
అయితే, ఈ సెట్లో 150 అడుగుల ఎత్తునున్న క్రేన్‌ విరిగిపడింది. ఈ ఘటనలో డైరెక్టర్‌ శంకర్‌ అసిస్టెంట్‌ మధు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కృష్ణ, సహాయకుడు చందర్‌లు ప్రాణాలు కోల్పోగా, మరో 10 మందికిపైగా గాయాలవగా వారికి ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. 
 
ఈ ప్రమాదంపై చిత్ర హీరో కమల్ హాసన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. "ఈ ప్రమాదం జరుగడం దురదృష్టకరం. ప్రమాదంలో ముగ్గురు స్నేహితులను కోల్పోయాం. పేదరికంలో నుంచి వచ్చిన ముగ్గురు కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం అందజేస్తా" అని కమల్ హాసన్ తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కమల్‌హాసన్‌ స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments