Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మాత వుంటేనే మనం సక్సెస్ అయ్యినట్లుః హీరో కార్తికేయ

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (13:28 IST)
Miles of Love team
కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి ,రమ్య పసుపులేటి జంటగా నందన్ దర్శకత్వంలో  రామ్ కామ్  బాక్డ్రాప్ లో  రాజు రెడ్డి నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న చిత్రం "మైల్స్ ఆఫ్ లవ్ ". ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. మరీ ముఖ్యంగా 'తెలియదే.. తెలియదే' అనేపాటకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఆ పాట ట్రెండింగ్లోనే ఉండడం మరో విశేషం. ఈ ఒక్క పాట సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసిందనే చెప్పాలి.  ఇదిలా ఉండగా చిత్రంలోని 'గగనము దాటే' వీడియో సాంగ్ ని హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.. ప్రముఖ గాయకుడు యశస్వి కొండేపూడి ఆలపించారు.ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల ఆయింది.అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో కార్తికేయ, నిర్మాత బెక్కం వేణుగోపాల్, హీరో దినేష్,పాగల్ డైరెక్టర్ నరేష్, నిర్మాత బాబ్జి ,  గాయత్రి గుప్త తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా వచ్చిన హీరో కార్తికేయ థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.
 
హీరో కార్తికేయ మాట్లాడుతూ,  ట్రైలర్స్ పాటలు చాలా బాగున్నాయి.ధ్రువన్ మంచి సంగీతం అందించారు. నిర్మాతకు ఇది మొదటి సినిమా అయినా నందన్ లాంటి మంచి దర్శకుడు తో ఈ కథను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా నిర్మించాడు. ఏ మూవీ కైనా నిర్మాత దొరకడంచాలా కష్టం. మనకు ఎంత టాలెంట్ ఉన్నా ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేసినప్పుడే మనం సక్సెస్ అయ్యినట్లు. ఈ సినిమా ద్వారా  ఇండస్ట్రీకి  కొత్త ప్రొడ్యూసర్ రావడం చాలా సంతోషంగా ఉంది. నా సినిమా RX 100 లోని "పిల్లారా.." సాంగ్ హిట్ అయినప్పుడే అదే ఇయర్ లో అభినవ్ ది 'ఉండిపోరాదే' సాంగ్ కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ ఇయర్  హిట్ సాంగ్స్ లలో ఎప్పుడూ ఈ రెండు సాంగ్స్  మాత్రమే ఉండేవి. ఈ సాంగ్స్  మధ్యనే కాంపిటీషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు తన సినిమా ఫంక్షన్ కు రావడం చాలా హ్యాపీ గా ఉంది. ఈ నెల 29 న వస్తున్న ఈ సినిమాతో పాటు విడుదల అవుతున్న అన్ని సినిమాలు పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు
 
చిత్ర నిర్మాత రాజారెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమాకు ఆర్.ఆర్.ధ్రువన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రమ్య, అభినవ్ కెమిస్ట్రీ ఎక్స్ట్రార్డినరీగా ఉంది.అభినవ్ మల్టీ టాలెంటెడ్. మా దర్శకుడు నందన్ డిఫరెంట్ కాన్సెప్టుతో "మైల్స్ ఆఫ్ లవ్" చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించాడు.రవిమణి కెమెరా విజువల్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి. రెగ్యులర్ కమర్షియల్ లో కాకుండా చేసిన ఈ సినిమా క్లీన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరూ  కచ్చితంగా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు అన్నారు
 
చిత్ర దర్శకుడు నందన్ మాట్లాడుత,  నన్ను నా కథపై ఉన్న నమ్మకంతో మాకు సపోర్ట్ గా నిలిచారు మా నిర్మాత రాజిరెడ్డి గారు. తను ఈ చిత్రాన్ని ఎక్కడా వెనకాడకుండా రిచ్ గా నిర్మించారు. బెక్కం వేణుగోపాల్ గారు మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ ఇస్తూ వస్తున్నారు. వారికి చాలా థాంక్స్. ఆర్.ఆర్ ధ్రువన్ మాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు ఈ  మ్యూజిక్ కు కచ్చితంగా కనెక్ట్ అవుతారు. అభినవ్, రమ్యల పెయిర్ చాలా బాగా కుదిరింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కోపరేట్ చేసి సినిమా బాగా రావడానికి హెల్ప్ చేశారు. రవి మణి కె.నాయుడు అందించిన విజువల్స్ కనుల పండగా ఉంటుంది. ఈ రోజు ఈ చిత్రం ప్రి రిలీజ్ జరుపు కుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
 
చిత్ర సంగీత దర్శకుడు ఆర్ ఆర్ ధ్రువన్ మాట్లాడుతూ, 2020 లో "సోలో బ్రతుకు సో బెటర్" సినిమా లోని 'హే ఇది నేనేనా'..,'ఇది నీ పెళ్లి' వంటి పాటలతో లిరిసిస్ట్ గా మంచి బ్రేక్ వచ్చింది. తరువాత నేను మంచి బ్రేక్ కోసం ఎదురు చూశాను. అలా లాక్ డౌన్ టైమ్ లో మధుర శ్రీధర్ గారి ద్వారా రాజిరెడ్డి అన్న కనెక్ట్ అయ్యాడు. అభినవ్ తో మూవీ అనగానే తను చేసిన సినిమాలోని 'ఉండి పోరాదే' సాంగ్ గుర్తుకొచ్చింది. అది నా పేవరేట్ సాంగ్. ఆ సాంగ్ ను నేను ఎన్నో షోస్ లలో పాడడం జరిగింది. అలాంటిది ఈ సినిమాలో కూడా అభినవ్ కు గుర్తుండిపోయే సాంగ్స్ ఇవ్వాలనుకున్నాను. అనుకున్ననట్లే ఇందులో ఉన్న అన్ని పాటలు హిట్ అయ్యాయి. అలా వైకుంఠ పురం తర్వాత సిద్ శ్రీరాం,అర్మాన్ మాలిక్ వంటి గొప్ప సింగర్స్ ఈ సినిమాకు రిపీట్ అవ్వడంతో ఈ సినిమాలోని పాటలకు హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. సిద్ శ్రీరామ్ గారు పాడిన  'తెలియదే తెలియదే' పాటకి యూట్యూబ్ లో 6.5 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఈ పాటలు ఇంతపెద్ద హిట్ అయ్యినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్ లో నేను ప్రేక్షకులకు ఇంకా మంచి సాంగ్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. రాజిరెడ్డి , అభినవ్ , నందన్, మణి గార్ల తో నాది చాలా యూనిక్ జర్నీ. నేను ఎన్నో విషయాలు తెలుసు కున్నాను, నేర్చుకున్నాను. ఈ జర్నీ నాకు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇంత మంచి పాటలు ఇచ్చిన నా లిరిసిస్ట్ చారి,రాజు లకు ధన్య వాదాలు.ఈ నెల 29 న వస్తున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను అన్నారు.

చిత్ర హీరో అభినవ్ మేడిశెట్టి, చిత్ర హీరోయిన్ రమ్య పసుపులేటి, లిరిసిస్ట్ పూర్ణా చారి, ఆలరాజు మాట్లాడుతూ, మా ఈ చిన్న సినిమాను సపోర్ట్ చేయడానికి వచ్చిన హీరో కార్తికేయ గారికి కండలే గాదు మంచి గుండె కూడా ఉందని ప్రూవ్ చేసుకున్నారు.  వారికి ధన్యవాదాలు అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments