Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైల్స్ అఫ్ లవ్ - టీజర్ చాలా బాగుంది- హీరో శ్రీ విష్ణు

Advertiesment
Hushar
, బుధవారం, 6 అక్టోబరు 2021 (16:11 IST)
Sri vishnu with Miles of Love team
`హుషారు` ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్ లుగా నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "మైల్స్ అఫ్ లవ్ ". కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజిరెడ్డి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. 'తెలియదే.. తెలియదే' సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సిద్‌ శ్రీరామ్ ఈ  పాటను ఆలపించగా 6 మిలియన్స్ వ్యూస్ అందుకుని సినిమా పై అంచనాలను భారీగా పెంచింది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు విడుదల చేశాడు.   
 
మంచి మెలోడీ మ్యూజిక్ తో ఈ టీజర్ మొదలవుతుంది. పాటలలాగానే నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఈ టీజర్ తో ముందే చెప్పేశారు. హీరో హీరోయిన్ లను కూడా ఎంతో క్యూట్ గా చూపించారు. మంచి విజువల్స్ తో సినిమాటోగ్రాఫర్ ఆకట్టుకున్నాడు. టీజర్ లో కొన్ని కొన్ని విజువల్స్ సినిమా పై ఇంట్రెస్ట్ ను తెప్పిస్తున్నాయి. టీజర్ ని బట్టి చిత్రం ప్యూర్ అండ్ హానెస్ట్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఎంతో ఫీల్ తో హీరో హీరోయిన్ ల మధ్య లవ్ స్టోరీ ఉండబోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టీజర్ చివర్లో వచ్చే ఓ షాట్ ద్వారా చూపించారు. దర్శకుడి ప్రతిభ కు కూడా ఇది టీజర్ వంటిది. డైలాగ్స్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. 'ప్రాబ్లమ్ ని ప్రాబ్లమ్ లా కాకుండా సొల్యూషన్ లా చూస్తే సొల్యూషన్ ప్రాబ్లమ్ అవుతుంది.. ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది..' అనే డైలాగ్ చాలా బాగుంది. టీజర్ లో కథ ను చెప్పే ప్రయత్నం చేసి మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా కనిపించాయి. కొన్ని కొన్ని సీన్స్ కి చాలానే ఖర్చుపెట్టారు. అందమైన లొకేషన్స్ లో సినిమా ని చిత్రీకరించి సినిమా పై మరింత ఆసక్తి పెంచారు. 
 
ఇక ఈ చిత్ర టీజర్ విడుదల చేసిన సందర్భంగా ప్రముఖ హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, టీజర్ చూశాను. చాలా ఫ్రెష్ గా ఉంది. హీరో అభినవ్ చాలా అందంగా కనిపించాడు.ఈ సినిమా కి  అందరు కొత్తవాళ్లే పని చేశారు.  ఈ సినిమా కి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మీ అందరు ఈ సినిమాను ఆదరించాలని ఆశిస్తున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాట్యం-లోని -వేణువులో.. పాట‌ను విడుద‌ల చేసిన‌ ర‌వితేజ