Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ పోరాటం ఎప్పుడూ ఉంటుంది: హీరో శ్రీరామ్

ఆ పోరాటం ఎప్పుడూ ఉంటుంది: హీరో శ్రీరామ్
, బుధవారం, 27 అక్టోబరు 2021 (13:10 IST)
Asalem jarigindi team
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటిస్తున్న చిత్రం  అసలేం జరిగింది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించారు. ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ తెలుగులో సహాయ పాత్రలు ఎక్కువగా వరిస్తున్నాయి. అలాంటి క్యారెక్టర్స్‌కు దూరంగా ఉంటూ సోలో హీరోగా మాత్రమే నటించాలని అనుకొని మంచి అవకాశం కోసం ఎదుచుస్తున్న తరుణంలో మేకప్‌మెన్ ద్వారా ఈ దర్శకనిర్మాతలు నన్ను కలిశారు. వారు చెప్పిన కథ నచ్చింది. లిమిటెడ్ బడ్జెట్‌లో నిజాయితీగా సినిమా చేస్తామని  మాటిచ్చారు. అన్నట్లుగానే ఎంతో క్రమశిక్షణ, తపనతో  కష్టాల కోర్చి నాణ్యతతో ఈసినిమా పూర్తిచేశారు. చక్కటి పదాలతో వాసు అర్థవంతమైన సంభాషణలు రాశారు. షూటింగ్ మొత్తం సరదాగా సాగింది. పల్లెటూరికి విహారయాత్రకు వెళ్లిన అనుభూతి కలిగింది. పెద్ద సినిమా వల్ల చిన్న చిత్రాలకు స్క్రీన్స్ దొరకడం లేదు. ఆ పోరాటం ఎప్పుడూ ఉంటుంది.పెద్దవారిని విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదు.  కష్టపడి  సాధించిన విజయంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. అలాంటి సక్సెస్‌ను  మాకు అందించిన చిత్రమిది.  
 
కొత్తవాళ్లను ప్రోత్సహించే కింగ్ జాన్సన్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలోకి రావాలి. అప్పుడే ప్రతిభావంతులకు అవకాశాలు దొరకుతాయి. మంచి పాటలున్న సినిమా చాలా రోజుల తర్వాత చేయడం ఆనందంగా అనిపించింది. మిడిల్‌క్లాస్ సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అన్నారు. నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ ఎక్సోడస్ మీడియా పతాకంపై మేము నిర్మించిన తొలి సినిమా ఇది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో పరిమిత బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నది. పాజిటివ్ టాక్ వస్తుంది. వసూళ్లు బాగున్నాయి. ఊహించని విజయమిది అని తెలిపారు. దర్శకుడు ఎన్వీఆర్ మాట్లాడుతూ ఈ సక్సెస్ క్రెడిట్ నిర్మాత జాన్సన్‌కు దక్కుతుంది. సినిమా హిట్ అవుతుందని నమ్మిన తొలి వ్యక్తి హీరో శ్రీరామ్. నన్ను, నా కథను నమ్మి అండగా నిలిచారు అని చెప్పారు. రచయితను అవ్వాలనే తన పదిహేనేళ్ల కల ఈ సినిమా ద్వారా తీరిందని వాసు పేర్కొన్నారు. ఇందులో తాను విలన్‌గా నటించానని, నటనపరంగా శ్రీరామ్ చక్కటి సలహాలిచ్చారని నటుడు రవికుమార్ పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అభిమానిని విమానంలో ర‌ప్పించి ఆర్థిక సాయం చేసిన చిరంజీవి