Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో రాజ‌శేఖ‌ర్ మేన‌రిజ‌మ్స్‌ని ఆయ‌నే ఇమిటేట్ చేస్తే.. ఎలా ఉంటుందో?

Webdunia
సోమవారం, 13 మే 2019 (18:37 IST)
ఇప్పటివరకు రాజశేఖర్ మేనరిజమ్స్‌ని చాలామంది ఇమిటేట్ చేశారు. రాజశేఖరే ఆయన మేనరిజమ్స్‌ని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది? 'ఏం సెప్తిరి... ఏం సెప్తిరి!' డైలాగ్ ఆయన చెప్తే ఎలా ఉంటుంది? 'కల్కి' కమర్షియల్ ట్రైలర్‌లో దర్శకుడు ప్రశాంత్ వర్మ చూపించారు. క‌ల్కి మూవీ ట్రైలర్ విడుదల చేశారు. 
 
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'కల్కి'. తెలుగు ప్రేక్షకులకు 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రాన్ని అందించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. శివానీ శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మే 31న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 
"కమర్షియల్ ట్రైలర్ విడుదల అయిన తర్వాత చాలా మంది ఫోన్లు చేశారు. మెసేజ్‌లు పెట్టారు. ట్రైలర్ చాలా బావుందని, చాలా ఎంజాయ్ చేశామని చెప్పారు. సోషల్ మీడియాలో కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. రెస్పాన్స్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా ఉంటుంది అన్నారు హీరో రాజ‌శేఖ‌ర్. 
 
దర్శకుడు ప్రశాంత్ వర్మ క్యారెక్టరైజేషన్ ట్రై చేద్దాం అని చెప్పినప్పుడు.... సెట్ అవుతుందా? లేదా? అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక చాలా హ్యాపీగా ఉంది. కమర్షియల్ ట్రైలర్లో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కూడా ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. సి. కళ్యాణ్ గారి నిర్మాణ భాగస్వామ్యంలో ఈ సినిమా చేయడం హ్యాపీ. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులకు ఎంత నచ్చాయో... సినిమా కూడా అంతే నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు. మ‌రి.. రాజ‌శేఖ‌ర్ ఈసారి కూడా మెప్పిస్తాడా.. లేదా..? అనేది ఈ నెల 31న తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments