బట్టలిప్పుకోవడాలు.. అమ్మాయిలు అబ్బాయిల మీదెక్కి కూర్చోవడమేనా సినిమా?

శుక్రవారం, 3 మే 2019 (16:07 IST)
"డిగ్రీ కాలేజీ" పేరుతో నరసింహన నంది దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ట్రైలర్‌ను సినీనటి జీవితా రాజశేఖర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ట్రైలర్‌ను చూసిన తర్వాత ఆమె సిగ్గుతో తలదించుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదలకు తాను సరైన పర్సన్ కాదంటూ వ్యాఖ్యానించారు. పైగా, చిత్ర దర్శకుడు నరసింహా నందిపై మండిపడ్డారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక చిత్రం తీయడం ఎంత కష్టమో.. ఆ చిత్రాన్ని రిలీజ్ చేయడం కూడా అంతే కష్టమన్నారు. నరసింహా నంది డైరెక్ట్ చేసిన డిగ్రీ కాలేజీ ట్రైలర్‌ను లాంఛ్ చేయడానికి తాను కరెక్ట్ పర్సన్ కాదన్నారు. పైగా, తాను సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ అని, ఈ చిత్రానికి ఇంకా సెన్సార్ కూడా పూర్తికాలేదనే అనుకుంటున్నా అని చెప్పారు. 'అర్జున్ రెడ్డి' చిత్రం పుణ్యమాని తెలుగులో వచ్చే చిత్రాలు లిప్‌లాక్ కిస్సులు లేకుండా రావడం లేదు. కాలేజీ సినిమాలు అంటే... మేక్ అవుట్స్ లేకుండా, లిప్ లాక్ కిస్సులు లేకుండా తీయకూడదనే స్థితికి దిగజారిపోయిందని అనుకుంటున్నా. తాను చూసిన ఈ ట్రైలర్‌లో మూడు నాలుగు లిప్‌లాక్ కిస్సులు ఉన్నాయన్నారు. 
 
ఈ సందర్భంగా ఇక్కడ ఓ విషయం చెప్పదలచుకున్నా. మనం ఏదైనా ఇల్లు కట్టుకుంటే బాత్రూమ్‌లోనే స్నానం చేస్తాం. హాలులో స్నానం చేయం. అలాగే, ప్రతి మనిషి జీవితంలో శృంగారం ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన అది ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే బాగుంటుందన్నారు. పబ్లిక్‌గా రోడ్డుపై చేస్తే అసహ్యంగా ఉంటుంది. ఇపుడు లిప్‌లాక్ సన్నివేశాలు కామనైపోయాయి. 
 
అలాగే బ‌ట్ట‌లిప్పుకోవ‌డం.. అమ్మాయిలు అబ్బాయిల మీదెక్కి కూర్చోవ‌డం, అబ్బాయిలు అమ్మాయిల మీదెక్కి కూర్చోవ‌డం కామ‌న్‌గా క‌న‌ప‌డుతున్నాయి. అంటే ఈ విష‌యాలు ఇది మీ జీవితంలో లేదా? అనొచ్చు. ఉన్నాయి. కానీ రోడ్డు మీద చేయ‌లేం క‌దా. ఇలా ఎందుకు చేయ‌కూడ‌దు? ఎందుకు సెన్సార్ ఇవ్వ‌రు? అని అడ్డంగా వాదించే డైరెక్ట‌ర్స్‌తో మ‌నం వాదించ‌లేం. కానీ ఈ విష‌యాలు సోష‌ల్ మీడియా, కంప్యూట‌ర్‌లో ఉండ‌టం లేదా? అని కూడా అనొచ్చు. కంప్యూట‌ర్‌లో ఇలాంటి విష‌యాల‌ను మ‌నం ఒక‌రిద్ద‌ర‌మో చూస్తామని గుర్తుచేశారు. 
 
కానీ, సినిమా అనేది కొన్ని వంద‌ల మంది క‌లిసి చూసేది. కొన్ని వంద‌ల మంది మ‌ధ్య‌లో మ‌నం శృంగారం చేయ‌లేం. ఇలాంటి విష‌యాల్లో సెన్సార్ కూడా చేయ‌లేక‌పోతున్నాం. ఏమైనా చెబితే ప్రెస్‌మీట్స్ పెట్టేసి సినిమాను అపేశామ‌ని అంటున్నారు. కోర్టుల‌కు వెళ్లిపోతున్నారు. కానీ మ‌న‌కు ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మ‌నం సోసైటీలో ఉన్నాం. మ‌న ఇంట్లో ఆడ‌పిల్ల‌లు, మ‌గ‌పిల్ల‌లున్నారు. సినిమాలో ఏదైనా చెప్పొచ్చు. కానీ దాన్ని అంద‌రూ చూసేలా అందంగా చెప్పాల‌నేది నా వ్య‌క్తిగ‌త అభిప్రాయమని జీవితా రాజేశేఖర్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శివాజీరాజా... నాగబాబుపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నా: ‘మా’ అధ్య‌క్షుడు న‌రేష్‌