Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జీవితారాజ‌శేఖ‌ర్ కూతురు ఫ‌స్ట్ సినిమా ఆగిందా? టెన్ష‌న్‌లో జీవితారాజ‌శేఖ‌ర్..!

Advertiesment
జీవితారాజ‌శేఖ‌ర్ కూతురు ఫ‌స్ట్ సినిమా ఆగిందా? టెన్ష‌న్‌లో జీవితారాజ‌శేఖ‌ర్..!
, సోమవారం, 6 మే 2019 (21:02 IST)
రాజశేఖర్‌, జీవిత దంప‌తుల పెద్ద‌ కుమార్తె శివాని. ఆమె 2 స్టేట్స్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ మూవీ 2 స్టేట్స్‌కి ఇది తెలుగు రీమేక్. ఇందులో అడ‌వి శేష్ హీరోగా న‌టిస్తున్నాడు. వెంక‌ట్ కుంచెం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో చాలా గ్రాండ్‌గా ప్రారంభించారు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ముహుర్త‌పు స‌న్నివేశానికి క్లాప్ ఇచ్చారు. 
 
అయితే.. ఇప్పుడు ఈ సినిమా ఆగిపోయింది. కుమార్తె ఫ‌స్ట్ సినిమానే ఆగిపోవ‌డంతో జీవితారాజ‌శేఖ‌ర్ దంప‌తులు బాగా ఫీల‌వుతున్నార‌ట‌. అస‌లు కార‌ణం ఏంటంటే... డైరెక్ట‌ర్ ఈ సినిమాని ఇప్ప‌టివ‌ర‌కు తీసింది చూస్తే... చెత్తగా వున్నదట‌. జీవిత రంగంలోకి దిగి ఎలాగైనా స‌రే.. ఈ సినిమాని కంప్లీట్ చేయిద్దామ‌ని ట్రై చేసినా ఫ‌లితం రావడంలేదట‌. దాంతో జీవితారాజ‌శేఖ‌ర్‌కి ఏం చేయాలో అర్థం కావడంలేదట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ దెబ్బ‌కు డీలాప‌డ్డ క్రిష్‌.. హిట్ కోసం ప‌క్కా ప్లాన్