Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 28 April 2025
webdunia

దాస‌రి కొడుకులు ఏం చేయ‌లేక‌పోయారు... అందుకే దాస‌రి కూతురు...

Advertiesment
Dasari Narayana rao
, శనివారం, 4 మే 2019 (14:16 IST)
దాస‌రి నారాయ‌ణ‌రావు అంటే ఒక వ్య‌క్తి కాదు. ఆయ‌నో శ‌క్తి. ఇండ‌స్ట్రీకి ఏదైనా స‌మ‌స్య వ‌చ్చింది అంటే... నేనున్నాను అంటూ ముందుండే వ్య‌క్తి. అలాగే ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా ఆయ‌న ఇంటికే వెళ్లేవారు. ఎంతోమందికి సేవ చేసారు. అలాంటిది ఆయ‌న వెళ్లిపోయిన త‌ర్వాత ఆయ‌న కుమారులు సేవా కార్య‌క్ర‌మాల‌ను కొనసాగించ‌లేక‌పోయారు. దీంతో ఆయ‌న కుమార్తె రంగంలోకి దిగి సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుండటం విశేషం.
 
డా.దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమోరియల్ నీడ చారిటబుల్ ట్రస్ట్ తరుపున దాసరి కుమార్తె హేమాలయ కుమారి, అల్లుడు డా. రఘునాథ్‌ బాబు చంద్ర, రాజేష్, చందు, నాగేశ్వరరావు త‌దిత‌రులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు. మా గురువు దాసరి గురించి గిట్టనివాళ్లు ఎన్ని చెప్పినా ముమ్మాటికి ఆయన సేవ చేశారు. తెలియకుండా ఎంతోమందికి దానధర్మాలు చేశారు. 
 
ఆయనను అత్యంత సన్నిహితంగా చూశాము కాబట్టి ఆయన ఏంటో మాకు తెలుసు. మా దృష్టిలో దాసరి ఎప్పటికీ దేవుడే. దాసరి సేవల్ని ఆయన కూతురు, అల్లుడు కొనసాగించడం ఆనందాన్ని కలిగిస్తోంది అని ఈ కార్య‌క్ర‌మంలో త‌మ్మారెడ్డి ఆనందం వ్య‌క్తం చేసారన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లు, ఆర్.నారాయ‌ణ‌మూర్తి, రేలంగి న‌ర‌సింహ‌రావు, ధ‌వళ సత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇదే వేదికపై కొంకపురి నాటక కళాపరిషత్‌కు దాసరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమకు వయసుతో పనిలేదు.. నచ్చితే వృద్ధుడ్ని కూడా ప్రేమిస్తా : రకుల్ ప్రీత్ సింగ్