Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప @1.6M లైక్స్: ఇంట్రడక్షన్ వీడియో సరికొత్త రికార్డులు

Webdunia
శుక్రవారం, 4 జూన్ 2021 (17:46 IST)
Pushpa
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప కొత్త రికార్డును నమోదు చేసుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బన్ని సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి చెందిన పుష్ప ఇంట్రడక్షన్ వీడియో యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తుంది. 
 
విడుదలైన క్షణం నుంచి రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యంత వేగంగా 70 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న తొలి ఇంట్రడక్షన్ వీడియోగా అల్లు అర్జున్ పుష్ప చరిత్ర సృష్టించింది.
 
1.6 మిలియన్ లైకులతో పాటు లక్షకు పైగానే కామెంట్స్ కూడా ఈ వీడియోకు రావడం విశేషం. తెలుగు ఇండస్ట్రీలో మరే ఇతర సినిమాకు సాధ్యం కాని రికార్డుల్ని అల్లు అర్జున్ తిరగరాశారు. ఈ సందర్భంగా ఈయన ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
 
ఈ వీడియోలో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను త్వరలోనే ప్రేక్షకులకు తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments