రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. సినిమా పూర్తయ్యాక అంతర్జాతీయ ప్రాజెక్ట్‌పై దృష్టి సారిస్తున్నారు. లైవ్ యానిమేషన్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధమయిందని కథా రచయిత విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.మనదేశంలో యానిమేషన్ సినిమాలు కొన్ని వచ్చాయి.అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే తక్కువేనని చెప్పాలి. అందుకే డిస్నీ సంస్థ రూపొందించిన యానిమేషన్ సినిమాలకు మంచి గుర్తింపు వుంది.
ప్రస్తుతం ఆ తరహాలో తెలుగు ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి చేర్చాలని రాజమౌళి టీమ్ నిర్ణయించింది. గతంలో ఈగ, బాహుబలి సినిమాలను ఆ సినిమాలు విడుదలయ్యాక యామినేషన్ కూడా చేశారు. కానీ ఈసారి చేయబోయే లైవ్ యానిమేషన్ ఇండియన్ కంటెంట్‌తో అంతర్జాతీయ ప్రమాణాలతో వుంటుందని తెలుస్తోంది. కాగా, ఆర్.ఆర్.ఆర్. తర్వాత మహేష్‌బాబుతో ఓ సినిమా వుంటుందని వార్త కూడా ఆ చిత్ర నిర్మాత కె.ఎల్. నారాయణ చెప్పారు. కానీ కథ ఇంకా సిద్ధం అయిందేలోదే తెలీదు. అంతా సిద్ధం అయ్యాక చెప్పండి అని కూడా ఆయన అన్నారు. ఇక మహేష్‌బాబు సర్కారువారి పాట తర్వాత మరో సినిమాకు సిద్ధమయ్యాడు. కనుక గేప్ చాలా వుంటుంది కనుక ఈలోగా లైవ్ యానిమేషన్ చేయవచ్చనని చిత్ర యూనిట్ చెబుతోంది.