Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా దేవుడిని ఏమైనా అంటే అస్సలు సహించేది లేదు : బండ్ల గణేష్

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (09:22 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను 'ఊసరవెల్లి'తో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పోల్చారు. దీనికి మెగా బ్రదర్, జనసేన పార్టీ నేత నాగబాబు గట్టిగానే తనదైనశైలిలో కౌంటరిచ్చాడు. అలా ప్రకాష్ రాజు - నాగబాబుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 
 
ఇపుడు సిన నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రంగంలోకి వచ్చారు. నా దేవుడిని ఏమైనా అంటే అస్సలు సహించేది లేదంటూ ప్రకాష్‌ రాజ్‌ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్‌ ట్వీట్స్‌ సధించారు. 
 
"ఎన్నికల సమయంలో మాట్లాడటం ధర్మంకాదని రాజకీయాలు మాట్లాడకూడదని నేనేం మాట్లాడలేదు. నేను ఒకటి మాత్రం చెప్తున్నాు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. ఆయన వ్యక్తిత్వం, ఆయన నిజాయితీ, ఆయన నిబద్ధత నాకు తెలుసు. 
 
పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను. పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం. 
 
ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు, ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్‌ది. నిజాయితీకి నిలువుటద్దం పవన్ కళ్యాణ్ నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది. నేను ఈరోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష'' అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్.. కీలక పరిణామం.. ఏంటది?

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపేందుకు ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నా: పాల్

OTTs : పాకిస్తాన్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను బంద్ చేయాలి.. కేంద్రం ఆదేశం

Operation Sindoor: 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ ఆగదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments