Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 12 April 2025
webdunia

ప్రేమ విఫలమైతే ఆ బాధ ఏ రేంజ్‌లో ఉంటుందో నాకు తెలుసు: రేణు దేశాయ్

Advertiesment
Renu Desai
, శుక్రవారం, 27 నవంబరు 2020 (16:29 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ నెటిజన్స్‌తో తరచు ముచ్చటిస్తూ ఉంటుంది. వారు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పలు సూచనలు కూడా చేస్తుంది. తాజాగా ప్రేమ విఫలమైతే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చేసే వారికి తగు సూచనలు చేసింది. 
 
ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించిన రేణూ దేశాయ్.. ప్రేమ విఫలం అయితే ఆ బాధ ఏ రేంజ్‌లో ఉంటుందో నాకు తెలుసు. ప్రేమించిన వ్యక్తి పక్కన లేనప్పుడు, మనం మోసపోయాం అని అనిపించినప్పుడు ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. 
 
అయితే ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం చాలా తప్పు. ముందు జీవితం, ప్రాణం గురించి ఆలోచించాలి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకొని కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో ఆ బాధ నుండి బయటపడొచ్చు అంటూ రేణూ దేశాయ్ పలు సూచనలు చేసింది.
 
కాగా.. 'బద్రి' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు రేణు దేశాయ్. ఆ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి, విడాకులు ఇలా వివిధ కారణాలతో సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఒక కొత్త సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారు.
 
మరోవైపు 'ఆద్య' అనే క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కాగా చాలా కాలం తరువాత రెండు దేశాయ్ తన అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమలో విఫలం అయ్యామని ఆత్మహత్య చేసుకోవడం సరైన మార్గం కాదన్నారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేణు స్పందిస్తూ.. మన ప్రాణం, జీవితం కన్నా ఎవరూ ఎక్కువ కాదు.
 
ప్రేమించిన వ్యక్తి మనతో లేకుండా, మనల్ని మోసం చేసారనే బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ ఆలోచనలు చాలా కష్టంగా ఉంటాయి. ప్రేమ విఫలమైతే తట్టుకోవడం కష్టమే కానీ మెల్లిమెల్లిగా ఈ బాధ నుంచి బయటపడవచ్చన్నారు. 
 
కుటుంబం, స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూ మళ్ళీ సాధారణ స్థితిలోకి రావచ్చన్నారు. అంతేగాని ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు. కాగా రైతుల నేపథ్యంలో రేణు దేశాయ్ ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఆ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుందని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి, నాగార్జున లాబీయింగ్ చేసుకుని మాకు అన్యాయం చేశారు